Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Fifa World Cup 2022: పసికూనపై విశ్వరూపం.. కోస్టారికాను 7-0తో చిత్తుచేసిన స్పెయిన్

Spain hammered Costa Rica 7-0 in their opening game of Fifa World Cup 2022

ఫిఫా వరల్డ్ కప్ గ్రూప్-ఈలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ జట్టు చెలరేగింది. పసికూన కోస్లారికాను 7-0తో చిత్తుచేసింది. అంతకుముందు ఇదే గ్రూప్‌లో బలమైన జర్మనీకి జపాన్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌ను స్పెయిన్ చాలా సీరియస్‌గా తీసుకుంది. పసికూన కోస్టారికాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని ముందుగానే అనుకున్నట్లు ఆరంభం నుంచే చెలరేగింది. మ్యాచ్ మొదటి అర్ధభాగంలో బంతి 85 శాతం స్పెయిన్ ఆటగాళ్ల వద్దనే ఉందంటేనే వాళ్లు ఎంత దూకుడుగా ఆడారో అర్థం చేసుకోవచ్చు.

మ్యాచ్‌కు ముందు రికార్డులు..

మ్యాచ్‌కు ముందు రికార్డులు..

స్పెయిన్ చివరగా ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింట విజేతగా నిలిచి, ఒక్క మ్యాచ్‌లో ఓడింది. అదే జోరును ప్రపంచకప్‌లో కూడా కొనసాగించాలని ధ్రుడంగా నిశ్చయించుకున్నట్లు కనిపించింది. అదే సమయంలో కోస్టారికా కూడా తక్కువేం కాదు. పేరుకు పసికూన అయినా ఈ జట్టు కూడా చివరి ఐదు మ్యాచుల్లో నాలుగింట గెలిచి, ఒకటి డ్రా చేసుకుంది. ఈ వరల్డ్ కప్‌లో కూడా పెద్ద అప్‌సెట్‌లు చూపించాలని అనుకుంది. కానీ వారి జోరుకు స్పెయిన్ కళ్లెం వేసింది.

తొలి హాఫ్‌లోనే భారీ ఆధిక్యం..

తొలి హాఫ్‌లోనే భారీ ఆధిక్యం..

స్పెయిన్ కెప్టెన్ లూయిస్ ఎన్రిక్ బాగా ఆలోచించిన తర్వాతనే ఆడే జట్టును సెలెక్ట్ చేసుకున్నట్లు కనిపించాడు. అనుభవంతోపాటు యువకులను కూడా ఎంపిక చేసి జట్టును బ్యాలెన్స్ చేశాడు. ఎలాగైనా జట్టును వరల్డ్ కప్ చివరి దశకు తీసుకెళ్లేందుకు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా ఆ జట్టు కదులుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మ్యాచ్ మొదలైన 11 నిమిషాల్లోనే స్పెయిన్ జట్టు తొలి గోల్ చేసింది. ఆ షాక్ నుంచి కోస్టారికా తేరుకునేలోపే మరో రెండు గోల్స్ చేసింది స్పెయిన్. దీంతో తొలి అర్థభాగాన్ని 3-0 ఆధిక్యంలో ముగించింది. ఈ సమయంలో స్పెయిన్ బాల్ పొసెషన్ 85 శాతం ఉందంటేనే వాళ్లు ఎంత ఎగ్రెసివ్‌గా ఆడారో తెలుస్తుంది.

సెకండ్ హాఫ్‌లో అదే జోరు..

సెకండ్ హాఫ్‌లో అదే జోరు..

భారీ ఆధిక్యం సాధించిన తర్వాత స్పెయిన్ కొంత నెమ్మదిస్తుందని, కోస్టారికాకు ఊపిరి తీసుకునే వెసులుబాటు కలుగుతుందని అంతా అనుకున్నారు. కానీ స్పెయిన్ జట్టు వేరే ప్లాన్‌తో బరిలో దిగింది. రెండో అర్ధభాగంలో కూడా ఎడాపెడా గోల్స్ కోసం ప్రయత్నించింది. ఒకరి తర్వాత ఒకరుగా స్పెయిన్ ఆటగాళ్లు గోల్స్ కోసం ప్రయత్నించారు.

చివరకు రెండో అర్ధభాగంలో మరో నాలుగు గోల్స్ పూర్తిచేశారు. ఈ సెకండ్ హాఫ్‌లో కూడా బంతిని ఎక్కువగా తమ వద్దనే ఉంచుకుంది స్పెయిన్ జట్టు. వీరి బాల్ పొసెషన్ 78 శాతంగా ఉండటం గమనార్హం. దీంతో ఈ మ్యాచ్‌ను 7-0తో ముగించి మిగతా జట్లకు బలమైన సందేశం పంపించిందా జట్టు. స్పెయిన్ ఆటగాళ్లరు ఆరుగురు ఆటగాళ్లు ఈ ఏడు గోల్స్ చేయడం గమనార్హం.

Story first published: Thursday, November 24, 2022, 11:48 [IST]
Other articles published on Nov 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+