Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జర్మనీని ఓడించి ఫైనల్ కు చేరిన స్పెయిన్

Carles Puyol
డర్బన్‌: స్పెయిన్ జర్మనీని ఓడించి తొలిసారి సాకర్‌ ప్రపంచకప్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం రాత్రి డర్బన్‌ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో స్పెయిన్‌ 1-0తో జర్మనీపై విజయం సాధించింది. పుయోల్‌ 73వ నిమిషంలో గోల్‌ కొట్టి తన జట్టుకు చరిత్రాత్మక విజయాన్నందించాడు. 2006 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఇటలీకి తలవంచిన జర్మనీ మరోసారి ఫైనల్‌కు చేరకుండానే ఇంటిముఖం పట్టింది. ఆదివారం జరిగే ఫైనల్లో స్పెయిన్‌.. నెదర్లాండ్స్‌ను ఢీకొంటుంది. డచ్‌ జట్టు కూడా ఇంతవరకూ ప్రపంచకప్‌ గెలవని నేపథ్యంలో కొత్త ఛాంపియన్‌ అవతరించనున్నట్లే!

మ్యాచ్‌ ఆరంభం నుంచి స్పెయిన్‌దే ఆధిపత్యం. బంతిని ఎక్కువగా నియంత్రణలో ఉంచుకున్న స్పెయిన్‌..పదేపదే జర్మనీ గోల్‌పోస్టుపై దాడులు చేసింది. ఐతే జర్మనీ రక్షణ శ్రేణి వాటిని సమర్థంగా అడ్డుకుంది. తొలి 20 నిమిషాల్లో స్పెయిన్‌కు అనేక గోల్‌ అవకాశాలు లభించాయి. డేవిడ్‌ విల్లా ఆరో నిమిషంలో స్పెయిన్‌ కు ఆధిక్యం అందించేట్లే కనిపించాడు. పెడ్రో ఇచ్చిన పాస్‌ను విల్లా గోల్‌పోస్టు వైపు పంపాడు. ఐతే జర్మనీ గోల్ ‌కీపర్‌ న్యూయెర్‌ తెలివిగా అడ్డుకున్నాడు. 14వ నిమిషంలో స్పెయిన్‌ కు మరో అవకాశం. పుయోల్‌ కొట్టిన కార్నర్‌ కిక్‌ను ఇనియెస్టా తలతో గోల్‌గా మలిచే ప్రయత్నం చేశాడు.

ఐతే బంతి గోల్ ‌పోస్టుకు దూరంగా వెళ్లింది. 19వ నిమిషంలో రామోస్‌ కూడా గోల్‌ కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆరంభంలో స్పెయిన్‌ దాడుల్ని కాచుకోవడానికే పరిమితమైన జర్మనీ క్రమంగా పుంజుకుంది. ప్రతిదాడులు చేసింది. 32వ నిమిషంలో ట్రొచోవ్‌స్కీ 25 గజాల నుంచి సూటిగా గోల్‌పోస్టు వైపు షాట్‌ కొట్టగా...గోల్‌ కీపర్‌ కాసిలాస్‌ (స్పెయిన్‌) అద్భుతంగా అడ్డుకున్నాడు. ప్రథమార్ధం 0-0తో ముగిసింది. రెండో అర్ధభాగంలో స్పెయిన్‌ దూకుడు పెంచింది. అలోన్సోకు 48, 50 నిమిషాల్లో గోల్‌ కొట్టే అవకాశాలు వచ్చినా..వృథా చేశాడు. ఐతే ఎట్టకేలకు 73వ నిమిషంలో స్పెయిన్‌ ప్రయత్నం ఫలించింది. జేవి కొట్టిన కార్నర్‌ కిక్‌ ను పుయోల్‌ తలతో గోల్‌ పోస్టులోకి నెట్టి స్పెయిన్‌ కు ఆధిక్యాన్నందించాడు. తర్వాత స్కోర్లు సమం చేసేందుకు జర్మనీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శనివారం మూడో స్థానం కోసం జరిగే ప్లేఆఫ్‌ లో జర్మనీ, ఉరుగ్వే తలపడతాయి.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+