Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సాకర్ కప్పు దక్కించుకున్న స్పెయిన్

Andres Iniesta
జొహానెస్‌ బర్గ్‌: ప్రపంచకప్ ‌లో చివరికి స్పెయినే విశ్వవిజేతగా నిలిచింది. తొలిసారి ప్రపంచ ట్రోఫీని సగర్వంగా ఎత్తుకుంది అంతా ఆశించినట్లుగానే తుదిపోరు అత్యంత రసవత్తరంగా సాగింది. రెండు జట్లు అద్భుతమైన అవకాశాలను సృష్టించుకున్నా సద్వినియోగం చేసుకోలేకపోయాయి. నిర్ణీత సమయంలో ఫలితం తేలకపోవడంతో ఆట అదనపు సమయానికి దారితీసింది. అక్కడా అదే తీరు. షూటౌట్‌ తప్పదేమో అనిపించింది. కానీ 109వ నిమిషంలో హిటింగా (నెదర్లాండ్స్‌) రెడ్‌ కార్డుకు గురవడం స్పెయిన్‌ కు కలిసొచ్చింది.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆ జట్టు..10 మందికే పరిమితమైన నెదర్లాండ్స్‌పై విరుచుకుపడింది. ఫలితమే మరో నాలుగు నిమిషాల్లో, అదనపు సమయం ముగుస్తుందనగా గోల్‌. ఫాబ్రెగాస్‌ పాస్‌ను అందుకున్న ఇనియెస్టా గోల్‌కీపర్‌ను బోల్తాకొట్టించాడు. మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ ఆటగాళ్లు మొత్తం తొమ్మిది పసుపు కార్డులు, ఒక రెడ్‌ కార్డు అందుకున్నారు. ఒక ఐరోపా జట్టు ఐరోపా బయట ప్రపంచకప్‌ గెలవడం ఇదే తొలిసారి. అతి తక్కువ గోల్స్‌ (8)తో ప్రపంచకప్‌ గెలిచిన జట్టు కూడా స్పెయినే. పాపం.. నెదర్లాండ్స్‌! మూడోసారి ఫైనల్లో ఓడి వేదనతో నిష్క్రమించింది.

డచ్‌ను భయపెట్టిన రామోస్‌: మ్యాచ్‌లో ఆరంభం నుంచి స్పెయిన్‌ దే ఆధిపత్యం. ఆ జట్టు ఎటాకింగ్‌ గేమ్‌ ఆడుతోంది. బంతిని ఎక్కువగా తన నియంత్రణలోనే ఉంచుకుంటోన్న స్పెయిన్‌..ప్రత్యర్థి గోల్ ‌పోస్ట్‌ పై ప్రమాదకరంగా దాడులు చేస్తోంది. ముఖ్యంగా రామోస్‌..నెదర్లాండ్స్ ‌ను భయపెట్టాడు. అతడు స్పెయిన్‌ను ఐదో నిమిషంలోనే ఆధిక్యంలో నిలిపినంత పనిచేశాడు. జేవి ఫ్రీకిక్‌ కొట్టగా..రామోస్‌ తలతో బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌ వైపు కొట్టాడు.

ఐతే నెదర్లాండ్స్‌ గోల్ ‌కీపర్‌ స్టెకెలెన్ ‌బర్గ్‌ కుడివైపు అద్భుతంగా దూకి బంతిని అడ్డుకున్నాడు. కాసేపటి తర్వాత రామోస్‌ మరోసారి నెదర్లాండ్స్‌ను హడలెత్తించాడు. 11వ నిమిషంలో ప్రత్యర్థి రక్షణశ్రేణిని దాటుకుంటూ గోల్‌ కోసం ప్రయత్నించాడు. ఐతే హిటింగా (నెదర్లాండ్స్‌) గోల్‌ కాకుండా కాపాడగలిగాడు. రామోస్‌ కు డేవిడ్‌ విల్లా కూడా తోడవడంతో డచ్‌ రక్షణశ్రేణి ఒత్తిడికి లోనైంది. 12వ నిమిషంలో విల్లా బంతి నెట్‌కు వెలుపలి అంచును తాకుతూ బయటపడింది. మరోవైపు నెదర్లాండ్స్‌ కూడా మధ్య మధ్యలో దాడులు చేసింది. ఐతే షాట్లు గురి తప్పాయి. 38వ నిమిషంలో అద్భుత అవకాశాన్ని చేజార్చుకోకుంటే నెదర్లాండ్స్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లేది. రాబెన్‌ కార్నర్‌ ను అందుకున్న బొమెల్‌ దాన్ని జెసెన్‌కు పంపించాడు. గోల్‌ చేసేందుకు చక్కని అవకాశాన్ని కల్పించాడు. కానీ జెసెన్‌ బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. ద్వితీయార్ధంలో నెదర్లాండ్స్‌ పుంజుకుంది. కానీ చివరికి తలవంచింది. 1974 తరవాత యూరో ఛాంప్‌ విశ్వవిజేత కావడం ఇదే తొలిసారి.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+