ప్రపంచకప్ పై స్పెయిన్ ఆశలు
కేప్ టౌన్: ఈసారి ప్రపంచ కప్ ను గెలుచుకోగలమన్న ఆత్మ విశ్వాసం స్పెయిన్ జట్టులో కన్పిస్తోంది. 'కఠినమైన మ్యాచ్ లను కూడా మేం గెలవగలమని నిరూపించాం. కొంతకాలంగా మేం పడ్డ కష్టానికి ప్రతిఫలం అందుతోంది. ఇంతవరకు మా జట్టు ప్రపంచ కప్ గెలుచుకోలేదు. ఈసారి చరిత్ర సృష్టించడం ఖాయం' అని స్పెయిన్ కోచ్ విసెంట్ డెల్ బోస్క్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం పోర్చుగల్ తో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో స్ట్రయికర్ డేవిడ్ విల్లా ఏకైక గోల్‌తో స్పెయిన్ జట్టుక్వార్టర్ లో ప్రవేశించింది.
ఇది విల్లాకు ఈ ప్రపంచ కప్ లో నాలుగో గోల్. క్వార్టర్స్‌లో ఎదురయ్యే పరాగ్వే జట్టును తక్కువ అంచనా వేయడం లేదని విల్లా చెప్పాడు. మరోవైపు ఈ ప్రపంచ కప్‌లో పెద్దగా ప్రభావం చూపని పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఈ మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా పేరున్న ఈ సోగ్గాడి పేలవ ప్రదర్శనపై అటు స్వదేశంలోనూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
స్పెయిన్ స్టార్ డేవిడ్ విల్లా ఈ ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శనతో జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. తాజాగా మంగళవారం పోర్చుగల్‌తో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లోనూ విల్లా సూపర్ గోల్‌తో 1-0 తేడాతో స్పెయిన్ గెలిచింది. తద్వారా క్వార్టర్ ఫైనల్స్‌లో పరాగ్వేతో పోటీకి సిద్ధమైంది. ప్రథమార్థంలో ఇరు జట్లూ గోల్ కోసం గట్టి ప్రయత్నాలే చేశాయి. ద్వితీయార్థం లో స్పెయిన్ ఆటగాళ్ల ఎదురుదాడులతో రొనాల్డో సేన బెంబేలెత్తింది. 63వ నిమిషంలో మిడ్ ఫీల్డర్ ఇనెస్టా పాస్‌ను హెర్నాండెజ్ అందుకుని రివర్స్‌లో విల్లా వైపు నెట్టాడు. మెరుపు వేగంతో అందుకున్న విల్లా వెంటనే గోల్ పోస్ట్‌లోకి పంపాడు. అయితే కీపర్ ఎడ్యూర్డో బంతిని పట్టుకునే ప్రయత్నంలో విఫలం కాగా బంతి తిరిగి విల్లా చెంతకే చేరింది. పొరపాటుకు తావీయకుండా విల్లా తన్నడంతో బార్‌కు తగిలి పోస్ట్‌లోకి వెళ్లడంతో స్పెయిన్‌కు 1-0 ఆధిక్యం లభించింది. గత 12 మ్యాచ్‌ల్లో పోర్చుగల్ ఇచ్చిన గోల్ ఇదొక్కటే.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications