కేప్ టౌన్: పోర్చుగల్ పై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్ ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. గోల్ రావడానికి గంటకు పైగానే సమయం పట్టింది. మ్యాచ్ 63 నిమిషంలో పోర్చుగల్ గోల్ కీపర్ అడ్డుకున్న బంతి తిరిగి స్పెయిన్ ఆటగాడు డేవిడ్ విల్లాకు చిక్కడంతో గోల్ గా మలచడంలో సఫలమయ్యాడు.
ప్రధమార్ధంలో ఇరుజట్లు గోల్ కోసం ప్రయత్నించినా నిరాశే మిగిలింది. ద్వితీయార్ధంలో ప్రత్యేక ఎత్తుగడలతో స్పెయిన్ అటాకింగ్‌కు దిగింది. వ్యూహం ఫలించింది. 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. అంతే స్పెయిన్ ఆనందానికి అవధుల్లేవు. తరువాత పోర్చుగల్ ఎదురుదాడికి దిగినా ఫలితానివ్వలేదు. దీంతో పోర్చుగల్ ప్రీక్వార్టర్స్ నుంచి భారంగా నిష్క్రమించింది.