జర్మనీని ఓడించిన స్పెయిన్ కే ఫైనల్ చాన్స్

జర్మనీలా టోర్నీలో అత్యధిక గోల్స్ చేయలేదు..బ్రెజిల్, అర్జెంటీనాల మాదిరిగా విపరీతంగా గోల్స్ కొట్టాలని తపించలేదు. ఆరు మ్యాచ్‌ల్లో స్పెయిన్ చేసింది ఏడు గోల్సే. కానీ తొలిసారి ప్రపంచకప్ ఫైనల్ చేరి చరిత్ర సృష్టించింది. టోర్నీలో అత్యుత్తమ జట్టుగా నీరాజనాలు అందుకుంటోంది.
ఆటంతా వ్యూహాత్మకం..: మైదానం మధ్యలో బంతిని అందుకున్న ఆటగాడు ప్రత్యర్థి రక్షణశ్రేణిని ఛేదించుకుంటూ గోల్ చేస్తే అద్భుతం. కానీ స్పెయిన్ ఆటలో ఇలాంటివి కనిపించకపోతే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆ జట్టు ఆటగాళ్లు బంతిని ఎక్కువసేపు దగ్గర ఉంచుకోవడానికి అసలు ఇష్టపడరు. మైదానంలో వ్యూహాత్మకంగా కదులుతారు. బంతి అందుకున్న వెంటనే మరొకరికి పంపిస్తారు. గీత గీసినట్టు నేరుగా తమ ఆటగాళ్లకే చేరేలా పాస్ ఇవ్వడం ప్రత్యేకత. స్పెయిన్ ఆటలోని ఆకర్షణ కూడా ఇదే. చిన్న చిన్న పాసులతో గోల్‌పోస్ట్ వైపు దూసుకెళ్లడం, గోల్‌తో అదరగొట్టడం స్పెయిన్‌కు తిరుగులేని బలం.
అందరికీ సాధ్యం కాదు..: బంతిపై నియంత్రణలో స్పెయిన్‌కు మరే జట్టు సాటిరాదనే చెప్పాలి. ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ (13)తో అదరగొట్టిన జర్మనీ సెమీస్ లో చతికిలపడిందంటే కారణమిదే. వేగవంతమైన పాస్ లతో బంతిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది స్పెయిన్. తెలివిగా పాస్ లు అందించుకుంటూ దూసుకెళ్లడం ఏ జట్టుకైనా సాధ్యమే! కానీ అలా గోల్స్ చేయడంలోనే ఉంది మజా. ఈ విషయంలో స్పెయిన్ దిట్ట. మిడ్ ఫీల్డ్ లో బస్కెట్స్, జేబీ అలోన్సో, జేవీ, ఇనియోస్టా చురుకైన పాస్ లతో కదిలితే..డేవిడ్ విల్లా, టోరెస్, రొడ్రిగ్జ్ మెరుపు గోల్స్ తో జట్టును గెలిపించడం అలవాటుగా చేసుకున్నారు. ఇదే శైలితోనే యూరో విజేతగా నిలిచిన స్పెయిన్ ప్రపంచకప్ లోనూ దుమ్మురేపుతోంది. టోర్నీలో ఆ జట్టు చేసిన ఏడు గోల్స్‌లో..డేవిడ్ విల్లా ఒక్కడే ఐదు కొట్టాడంటేనే తెలుస్తుంది. స్పెయిన్ పక్కా వ్యూహాలతో బరిలోకి దిగుతోందని!
స్పెయిన్ లాగే నెదర్లాండ్స్ కూడా చిన్న పాస్ లతో కదులుతూ అద్భుత గోల్స్ చేయడంలో నేర్పరి. తొలి ప్రపంచకప్ ను ఎలాగైనా సాధించాలని దృఢ సంకల్పంతో ఉన్న ఈ రెండు జట్ల మధ్య తుది సమరం సాకర్ అభిమానులను ఉర్రూతలూగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications