For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సౌత్ అమెరికన్లే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్

By Nageshwara Rao

న్యూఢిల్లీ: ప్రస్తుత సీజన్‌లో అత్యధిక గోల్స్ సాధించిన వారిలో సౌత్అమెరికన్లదే పైచేయి కావడమేమీ ఆశ్చర్యం కలిగించలేదు. తొలి రెండు ఎడిషన్లలోనూ వారిదే హవా. బ్రెజిలియన్ ప్లేయర్ ఎలానో, కొలంబియా ఆటగాడు స్టీవెన్ మెండొజా లీగ్‌లో అత్యధిక గోల్స్ సాధించారు.

ఇప్పటివరకు ప్రస్తుత సీజన్‌లో నమోదైన 51 గోల్స్‌లో 16 సౌత్ అమెరికన్లవే. వాటిల్లో ఉరుగ్వే ప్లేయర్ ఎమిలియానో అల్ఫారో ఐదు గోల్స్‌లో టాప్‌లో నిలిచాడు. మిగతా 11 గోల్స్ సమిష్టిగా ఆయా జట్లలోని సభ్యుల అసిస్టెన్స్‌తో పూర్తిచేసినవే. తద్వారా 50 శాతం గోల్స్ ప్రత్యక్ష నమోదులో కీలక పాత్ర పోషించడం ద్వారా సీజన్ టోర్నీలోనే హైలెట్ గా నిలిచారు.

ఎఫ్ సి గోవా జట్టుపై పాటోర్డా స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డైనమోస్ సంచలనం మార్సిలెన్హో తెలివిగా చేసిన గోల్.. 2 - 0 స్కోర్ తేడాతో జట్టు విజయానికి దోహదపడింది. అదే సమయంలో ఐఎస్ఎల్ 3 ఎడిషన్‌లోనే 50వ గోల్‌చేసిన రికార్డు దక్కించుకున్నాడు మార్సిలిన్హో. టోర్నీలో 50 గోల్స్ రికార్డును చేరుకోవడానికి ఈ దఫా 27 మ్యాచ్‌ల వరకు వేచి చూడాల్సి వచ్చింది.

South Americans take centre stage as Hero ISL 2016 reaches fifty goals

ఇదే దశలో తొలి ఏడాది 61 గోల్స్, 2015లో 71 గోల్స్ నమోదయ్యాయి. ఈ సీజనంతా డిఫెన్సివ్ ఫోర్సులదే. కేరళ బ్లాక్ బస్టర్స్ ది అంతా విలక్షణమైన ఆట. ఎఫ్ సి పుణె సిటీకి వ్యతిరేకంగా జరిగిన మ్యాచ్‌లో బ్లాక్ బస్టర్స్ ప్లేయర్ సెడ్రిక్ హెంగ్‌బార్ట్ మూడో నిమిషంలో, ఎఫ్ సి గోవాపై జరిగిన మ్యాచ్‌ సెకండాఫ్‌లో మహ్మద్ రఫీ శరవేగంగా గోల్స్ సాధించారు. ఇక ఈ సీజన్‌లో 51వ గోల్ కూడా ఢిల్లీ డైనమోస్ కుర్రాడు రిచర్డ్ గాడ్జెదే కావడం గమనార్హం.

ఢిల్లీ డైనమోస్ గోల్స్ గర్జన
ఈ సీజన్‌లో గోల్స్ సాధించుకొనేందుకు ఢిల్లీ డైనమోస్ కుర్రాళ్లు గర్జిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఏడు మ్యాచ్‌ల్లోనే 10 గోల్స్ చేసి రికార్డు సాధించారు. రెండు కంటే ఎక్కువ గోల్స్ చేసిన జట్టు ఉన్నదంటే అదీ ఢిల్లీ డైనమోస్ మాత్రమే. ప్రతి మ్యాచ్‌లోనూ వారి డిఫెన్సివ్ రికార్డు. ఏడు మ్యాచ్ ల్లోనూ డిఫెన్సివ్‌గా ఆడిన ఫలితమే ఎఫ్ సి గోవా జట్టు తర్వాత పాయింట్ల పట్టికలో ఢిల్లీ దిగువ స్థానంలో చేరింది.

అయితే గోవాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 2 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించిన జంబ్రొట్టా జట్టు.. టాప్ ఫోర్‌లో మూడోస్థానాన్ని ఆక్రమించుకోవడం గమనార్హం. ఏడు మ్యాచ్‌లలోనూ 11 దఫాలు ఢిల్లీ కుర్రాళ్లు గోల్స్ సాధించేందుకు ప్రయత్నించినప్పుడల్లా సముద్ర అలల మాదిరిగా గోల్ పోస్ట్ ఊగిపోయిందంటే వారి దూకుడెలా ఉందో అర్థమవుతూనే ఉంది.

మార్సిలిన్హో ఓ అద్భుతం
ఐఎస్ఎల్ 3 ఎడిషన్ హీరో.. ఢిల్లీ డైనమోస్ ఇంద్రజాల ప్లేయర్ మార్సిలిన్హో ఓ అద్భుతమంటే అతిశేయోక్తి కాదు. ఈ సీజన్‌లో లయన్స్ (ఢిల్లీ డైనమోస్) చేసిన 10 గోల్స్‌లో 8 గోల్స్ మార్సిలిన్హో ఖాతాలోవే. ఢిల్లీలో విధ్వంసకర పాత్ర పోషించిన బ్రెజిలియన్ వింగర్ నాలుగు గోల్స్ చేస్తే, మరో నాలుగు గోల్స్‌లో అసిస్టెన్స్ ఇచ్చాడు. కేరళ బ్లాక్ బస్టర్స్‌పై పలుసార్లు, అట్లెటికో డీ కోల్‌కతా జట్టుపై గోల్స్‌లో ఆయన పాత్ర ఎనలేనిది.

ఈ దఫా లాంగ్ రేంజ్ గోల్స్‌దే పంట
ఈ సీజన్‌లోని 51 గోల్స్‌లో 21 బాక్స్ ఔట్ సైడ్ నుంచి చేసినవే. కొన్ని జట్లు ఇన్‌సైడ్ బాక్స్‌లో కంటే బయటనుంచే అత్యధిక గోల్స్ చేశాయి. అట్లెటికో డీ కోల్‌కతా (ఎటికె), పుణె జట్లు నాలుగు సార్లు బాక్స్ అవతల నుంచి పెనాల్టీ ఏరియా నుంచే గోల్స్ చేశారు. ఇన్‌సైడ్ బాక్స్‌లో ఎటికె రెండు, పుణె ఒక గోల్ చేశాయి.

డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నైయిన్ ఎఫ్‌సి ఇన్‌సైడ్, ఔట్‌సైడ్ బాక్స్ నుంచి ఎడాపెడా గోల్స్ సాధించగలిగింది. చెన్నైయిన్ చేసిన ఏడు గోల్స్‌లో ఒక్కటి మాత్రమే 18 యార్డ్ బాక్స్ లోపలే సాధించింది. మిగతా ఆరు గోల్స్ దూరం నుంచే చేసినవి కావడం గమనార్హం.

గౌర్‌డియోలాతో మాంఛెస్టర్ సిటీలో మార్పు: మెస్సీ
కోచ్‌గా తమ మాజీ శిక్షకుడు పెప్ గౌర్ డియోల్ రాకతో ఇంగ్లిష్ క్లబ్ మాంఛెస్టర్ సిటీ జట్టు పరిస్థితి మెరుగవుతుందని ఎఫ్ సి బార్సిలోనా స్ట్రయికర్ లియానెల్ మెస్సీ విశ్వాసం వ్యక్తంచేశాడు. మెస్సీపై అన్నివైపులా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో 2008 నుంచి 2012 మధ్య కాటలాన్ జెయింట్స్‌కు బార్సిలోనా మాజీ సారధి గౌర్‌డియోలా కోచ్ గా వ్యవహరించాడు.

ఈ సమయంలో రెండు యూరోపియన్ చాంపియన్స్ లీగ్, మూడు లా లీగ టైటిళ్లను బార్సిలోనా ఎఫ్ సి జట్టు గెలుచుకున్నది. తర్వాత బేయర్న్ మ్యునిచ్ జట్టు కోసం వెళ్లిన గౌర్‌డియోలా బుండేస్లిగా టైటిళ్ల హ్యాట్రిక్ సాధించాడు. తాజాగా మాంఛెస్టర్ సిటీ క్లబ్ కోచ్‌గా బాద్యతలు స్వీకరించాడు.

గౌర్‌డియోలా కోచ్‌గా నియామకంపై మెస్సీ స్పందిస్తూ 'మాంఛెస్టర్ సిటీకి గొప్ప టీం ఉంది. ప్రతిసారీ మంచి టీం బరిలోకి దిగుతుంది. ఈ సారి మేం పెప్ శిక్షణలోని జట్టుతో తలపడాల్సి ఉంది' అని అన్నాడు. బార్సిలోనా మంగళవారం మాంఛెస్టర్ సిటీతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో పాల్గొనేందుకు మెస్సీ గాయపడిన గెరార్డ్ పిఖ్యూ, జోర్డీ అల్బా, సస్పెన్షన్ కు గురైన డిఫెండర్లు లేకుండానే మాంఛెస్టర్ కు చేరుకున్నాడు.

మరో డిఫెన్సివ్ మిడ్ ఫీల్డర్ సెర్జియో బస్క్వేట్స్ తాజాగా బార్సిలోనా తరఫున మ్యాచ్‌లో పాల్గొననున్నాడు. గౌర్ డియోలా నాటి శిక్షణతో ప్రస్తుత బార్సిలోనా కోచ్ లూయిస్ ఎన్రిక్యు మధ్య పోలికలపై స్పందిస్తూ బార్సిలోనా వంటి క్లబ్‌కు మాత్రమే కొన్ని ప్రత్యేకతలు ఉంటాయని తెలిపాడు. అయితే ప్రతి కోచ్ వద్ద విభిన్నమైన ఆలోచనలు అందుబాటులో ఉంటాయన్నాడు. లూయిస్ ఎన్రిక్యు ఆధ్వర్యంలో తమ జట్టు దూకుడుగా దూసుకెళ్తుందని, కానీ పెప్ వద్ద నెమ్మదిగా దూసుకెళ్లే తత్వం ఉందన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+