Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

45 రోజులే: టికెట్లన్నీ అభిమానులకే, ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఫిఫా

Some 2.5 million tickets sold for 2018 FIFA World Cup in Russia

హైదరాబాద్: రష్యాలో సాకర్ సంరంభం ప్రారంభానికి 45 రోజుల గడువు మాత్రమే ఉంది. కానీ ఇప్పటికే ఫుట్‌బాల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు 25 లక్షల టిక్కెట్లు అమ్ముడు పోయాయి. రష్యా రాజధాని మాస్కోలో రెండు స్టేడియాలతో పాటు మొత్తం 12 స్టేడియాలలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి.

టిక్కెట్లను కొనుగోలు చేసిన 53 శాతం మంది విదేశాలకు చెందిన అభిమానులేనని రష్యా డిప్యూటీ ప్రధానమంత్రి విటలీ ముత్కో తెలిపారు. డిప్యూటీ ప్రధాని విటలీ ముత్కో విదేశీ వ్యవహారాలు, పర్యాటక, క్రీడా మంత్రిత్వ శాఖలను కూడా నిర్వహిస్తున్నారు.

అమెరికా నుంచి 30 వేల మంది అభిమానుల రాక

అమెరికా నుంచి 30 వేల మంది అభిమానుల రాక

‘వివిధ దేశాల నుంచి ఆయా దేశాల ప్రభుత్వాలు తమ దేశం నుంచి 15 వేల మంది నుంచి 20 వేల మంది చొప్పున అభిమానులను రష్యాకు పంపుతున్నారు. అందునా ప్రస్తుతం రష్యా అంటే మండిపడుతున్న అమెరికా నుంచి 30 వేల మంది అభిమానులు వస్తారని అంచనా వేస్తున్నారు. సాకర్ కప్ సందర్భంగా మా దేశానికి వచ్చే పర్యాటకులకు మేం ప్రతిష్ఠాత్మకంగా ఆతిథ్య వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది' అని విటలీ ముత్కో చెప్పారు. పది రోజుల క్రితమే అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘాల సమాఖ్య ‘ఫిఫా' మూడోదశ, చివరి దశ టిక్కెట్లు విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్ నెలలో తొలిదశ టిక్కెట్లు విక్రయం ప్రారంభించిన ఫిఫా.. ఇప్పటి వరకు 16,98,049 టిక్కెట్లు విక్రయించినట్లు తెలిపింది. ఈ నెల 18న తుది దశ టిక్కెట్ల విక్రయంలో భాగంగా కేవలం 24 గంటల్లోనే 1.64 లక్షల టిక్కెట్లను ఫిఫా విక్రయించింది.

ట్రంప్‌కు నైతిక ప్రమాణాలు గుర్తు చేసిన ఫిఫా

ట్రంప్‌కు నైతిక ప్రమాణాలు గుర్తు చేసిన ఫిఫా

2026 ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులను గెలుచుకునేందుకు బిడ్ దాఖలు చేసిన అమెరికా కూటమికి వ్యతిరేకంగా పని చేసిన లాబీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను ఫిఫా తప్పుబట్టింది. ఫిఫా సభ్య దేశాల ‘సాకర్ సమాఖ్య'లను ప్రభావితం చేసే విధంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ‘ఫిఫా' నైతిక విలువలకు వ్యతిరేకమని పేర్కొన్నది. మొరాకోకు వ్యతిరేకంగా మెక్సికో, కెనడాలతో కలిసి అమెరికా కూటమిగా బిడ్ దాఖలు చేసింది. ‘బిడ్' గెలుచుకునేందుకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, బెదిరింపులపై వ్యాఖ్యానించడానికి ‘ఫిఫా' నిరాకరించింది.

ట్రంప్ ట్వీట్.. ఫిఫా బిడ్ ప్రవర్తనానియమావళికి వ్యతిరేకం ఇలా

ట్రంప్ ట్వీట్.. ఫిఫా బిడ్ ప్రవర్తనానియమావళికి వ్యతిరేకం ఇలా

డొనాల్డ్ ట్రంప్‌ అభిప్రాయానికి వ్యతిరేకంగా ‘ఫిఫా' బిడ్ ప్రవర్తనానియమావళిని గుర్తు చేసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ బిడ్ దాఖలు చేసిన దేశానికి వ్యతిరేకంగా ప్రభావితం చేసేందుకు సాకర్ సభ్య దేశాలను ప్రభావితం చేసే ఏ ప్రకటననైనా తిరస్కరించాలని ఫిఫా సూచించింది. 2026 ప్రపంచ కప్ ఆతిథ్య హక్కుల కోసం బిడ్ దాఖలు చేసినప్పుడు అమెరికా సాకర్ సమాఖ్య అధ్యక్షుడు సునీల్ గులాటీ మాట్లాడుతూ తమ నిర్ణయానికి దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఉన్నదని ప్రకటించారు.

 మొరాకోకు మద్దతుగా రష్యా సహా ఈయూ సభ్య దేశాల మద్దతు

మొరాకోకు మద్దతుగా రష్యా సహా ఈయూ సభ్య దేశాల మద్దతు

ప్రస్తుతం జూన్ నుంచి ప్రపంచ కప్ టోర్నమెంట్ నిర్వహణకు ఆతిథ్యం ఇవ్వనున్న రష్యాతోపాటు ఫ్రాన్స్, బెల్జియంతోపాటు పలు యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన సాకర్ సమాఖ్యలు.. మొరాకో బిడ్‌కు మద్దతు ప్రకటించాయి. కరేబియన్ దేశాలైన సెయింట్ లుసియా, డొమినికా తదితర దేశాల ప్రభుత్వాలు కూడా మొరాకోకు బాసటగా నిలుస్తామని ప్రకటించాయి. 206 సభ్య దేశాలు గల ఫిఫా కార్యవర్గంలో అమెరికా కూటమికి సెంట్రల్, సౌత్ అమెరికాతోపాటు సౌదీ అరేబియా సహా 16 సభ్య దేశాల మద్దతు లభిస్తుంది.

Story first published: Wednesday, May 23, 2018, 13:59 [IST]
Other articles published on May 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+