Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చైనా కంటే యూరప్‌లోనే కరోనా ప్రభావం ఎక్కువ.. వుహాన్‌కు తిరుగుప్రయాణమైన సాకర్ జట్టు!!

Soccer Team from coronavirus epicenter to leave Spain to return to Wuhan

మాడ్రిడ్: ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ (కొవిడ్-19) హైరానా పుట్టిస్తున్నది. కరోనా కారణంగా ఇప్పటికే పలు క్రీడా టోర్నీలు వాయిదా పడగా.. మరికొన్ని అదే బాట పడుతున్నాయి. తాజాగా ఐపీఎల్‌ 13వ సీజన్‌కు సంబంధించిన మ్యాచ్‌ల నిర్వహణపై అనిశ్చితి ఏర్పడింది. ఈ క్రమంలో కరోనా ప్రభావంతో ఓ సాకర్ జట్టు స్పెయిన్‌లో తమ ట్రైనింగ్ క్యాంప్‌ను మధ్యలోనే వదిలేసి సొంత దేశం చైనాకు వెళ్లడం గమనార్హం. కరోనా వైరస్‌కు కేంద్ర బిందువు వుహాన్ నగరం అన్న విషయం తెలిసిందే.

చైనాకు చెందిన సాకర్ జట్టు 'వుహాన్ జల్' స్పెయిన్‌లో ఉంది. జనవరి 29న ప్రీ-సీజన్ పర్యటన కోసం అండలూసియా ప్రాంతంలోని కాడిజ్కు వెళ్ళింది. ఇక కరోనా వైరస్ వ్యాప్తి మరింత తీవ్రతరం కావడంతో చైనా సూపర్ లీగ్ వాయిదా పడింది. దీంతో వుహాన్ జల్ జట్టు చైనాకు రాకుండా అక్కడే ఉంది. తాజాగా మహమ్మారి కరోనా యూరప్‌లో కూడా తన ప్రభావాన్ని చూపుతుంది. దీంతో వుహాన్ జల్ జట్టు స్పెయిన్‌ను విడిచి సొంత దేశం చైనాకు బయలుదేరింది.

వుహాన్ జల్ జట్టు కోచ్ జోస్ గొంజాలెజ్ స్పెయిన్‌లోని ఓ వార్తా సంస్థతో గురువారం మాట్లాడుతూ చైనాకు తిరిగి వెళ్ళిపోతున్నాం అని చెప్పాడు. 'కరోనా వైరస్‌ ప్రభావం చైనాలో తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం సమస్య ఇక్కడ ఉంది. కరోనా ప్రభావం చైనాలో కంటే యూరప్‌లోనే ఎక్కువగా ఉంది' అని గొంజాలెజ్ పేర్కొన్నాడు. కరోనా కారణంగా చైనాలో 3,169 మంది చనిపోగా.. ప్రపంచవ్యాప్తంగా 4,600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. హుబీ ప్రావిన్స్‌లో కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. అయితే చైనాలో నమోదు కేసుల సంఖ్య ఇటీవల తగ్గింది.

ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా వన్ కార్ల రేస్‌కు 'కరోనా' కాటు తగిలింది. ఈ నెల 15వతేదీ నుంచి ఆస్ట్రేలియాలో జరగనున్న గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా వన్ కారు రేసింగ్ పోటీలను కరోనా వైరస్ వ్యాప్తి వల్ల రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వహణ కమిటీ శుక్రవారం ప్రకటించింది. బ్రిటన్ దేశానికి చెందిన లండన్ హెడ్ కోచ్ మైకేల్ ఆర్టెటాకు కరోనావైరస్ సోకింది. లండన్ నగరంలో ప్రముఖ క్రీడా శిక్షణ కేంద్రానికి చెందిన హెడ్ కోచ్ మైకేల్ అర్టెటాకు జరిపిన పరీక్షల్లో పాజిటివ్ అని రిపోర్టు రావడంతో అతను సెల్ఫ్ ఐసోలేషన్ గదిలోకి వెళ్లి చికిత్స పొందుతున్నారు.

Story first published: Friday, March 13, 2020, 15:11 [IST]
Other articles published on Mar 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+