Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Neymar:సౌదీ ఫుట్‌బాల్ క్లబ్‌‌కు నేమార్.. ఎంతకు కొనిందో తెలుసా..?

Neymar:నేమార్... సాకర్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ బ్రెజిల్ సాకర్ స్టార్ గత ఆరు సీజన్ల వరకు తాను ప్రాతినిథ్యం వహించిన పారిస్ సెయింట్ జర్మెన్ (PSG) జట్టుకు గుడ్ బై చెప్పేశాడు. ఇక సౌదీ ప్రో లీగ్‌లో నేమార్ ప్రత్యక్ష్యం కానున్నాడు. నేమార్‌కు భారీ పారితోషికం చెల్లించి సొంతం చేసుకుంది అల్ హిలాల్ జట్టు. మంగళవారం పారిస్ సెయింట్ జెర్మెన్-అల్ హిలాల్ క్లబ్స్ మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా అల్ హిలాల్ క్లబ్ నేమార్ బదిలీ కోసం PSG క్లబ్‌కు 98 మిలియన్‌ అమెరికన్ డాలర్లను చెల్లించి కొత్త రికార్డు సృష్టించింది.

సౌదీ క్లబ్ సాకర్‌లో ఇప్పటి వరకు అల్ హిలాల్ జట్లు 18 సార్లు నేషనల్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ లీగ్‌లో మొత్తం నాలుగు జట్లు పాల్గొంటాయి.పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (PIF) ద్వారా ప్రభావవంతంగా జాతీయం చేయబడిన నాలుగు సౌదీ క్లబ్‌లలో అల్ హిలాల్ ఒకటి. మొత్తం 700 బిలియన్ డాలర్ల మేరా ఈ క్లబ్‌కు ఆస్తులున్నట్లు సమాచారం.

Soccer star Neymar Joins Al Hilal in Saudi Arabia, Ending Six-Season Stint with Paris Saint-Germain

ఇదిలా ఉంటే 31 ఏళ్ల ఈ సాకర్ స్టార్ నేమార్ రెండేళ్ల కాంట్రాక్ట్ పై సంతకం చేశాడు. ఈ కాంట్రాక్ట్‌తో నేమార్‌కు 100 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం అందుతుంది.అల్ నసర్‌ జట్టుకు ఆడుతున్న మరో స్టార్ క్రిస్టియానో రొనాల్డో పొందుతున్న వార్షిక వేతనంలో ఇది సగం ఉంటుంది. ఈ ఏడాది జనవరిలో సౌదీ ప్రో లీగ్‌లో క్రిస్టియానో అడుగుపెట్టాడు.

యూరోప్‌‌లో తాను చాలా సాధించినట్లు చెప్పుకొచ్చిన నేమార్.. ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నట్లు చెప్పాడు. అయితే తాను ఒక్క యూరోప్‌కే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్లబ్స్‌కు ఆడి సవాళ్లను స్వీకరించాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించాలని తాను భావిస్తున్నట్లు వివరించిన నేమార్.. ఇందుకు సౌదీ ప్రో లీగ్ చక్కటి అవకాశంగా మలుచుకుంటానని వెల్లడించాడు.

ఇదిలా ఉంటే ఇకపై నేమార్ PSGతో ఉండడని ఆ జట్టు యాజమాన్యం అధికారికంగా ధృవీకరించింది. నేమార్‌ను ప్రపంచపు అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరని అభివర్ణించింది.గత ఆరేళ్లుగా పారిస్ సెయింట్ జెర్మెన్‌ జట్టులో భాగమైన నేమార్ తమ జట్టుకు, ప్రాజెక్టులకు ఎంతో చేశాడని కొనియాడారు PSG జట్టు యాజమాని అల్ ఖెలైఫి.నేమార్‌ను ఎప్పటికీ తాము గుర్తుంచుకుంటామని చెప్పారు. వాస్తవానికి నేమార్ తిరిగి బార్సిలోనా జట్టుకు వెళ్లాలనే యోచనలో ఉండగా... స్పానిష్ జట్టు ట్రాన్స్‌ఫర్ కోసం అంత భారీ మొత్తాన్ని చెల్లించలేకపోయింది.అదే సమయంలో మరొక టాప్ యూరోపియన్ క్లబ్ కూడా నేమార్ బదిలీ కోసం భారీగా డబ్బులు చెల్లించేందుకు ధైర్యం చేయలేదు. దీనికి కారణం గత కొంత కాలంగా నేమార్ గాయాల బారినపడి కాస్త ఇబ్బంది పడుతున్నాడు.

ఒకప్పుడు PSG జట్టు నేమార్, ఎంబాపే, మెస్సీలాంటి స్టార్ ఆటగాళ్లతో ఉండగా... ప్రస్తుతం ఎంబాపే మాత్రమే ఆ జట్టులో ఉన్నాడు.అల్ హిలాల్ ఎంబాపేకు ఆఫర్ ఇచ్చినప్పటికీ తాను మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు.ప్రస్తుతం అల్ హిలాల్ జట్టులో బ్రెజిల్ స్టార్ మాల్కమ్, పోర్చుగల్ మిడ్ ఫీల్డర్ రూబెన్ నేవ్స్,సెనెగల్ డిఫెండర్ కాలిడో కోలిబాలిలు ఉన్నారు.

Story first published: Thursday, August 17, 2023, 13:28 [IST]
Other articles published on Aug 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+