డిఫెండింగ్ చాంపియన్ ఇటలీ ప్రపంచకప్ నుంచి నిష్క్రమణ
జొహానెస్ బర్గ్: డిఫెండింగ్ ఛాంపియన్ ఇటలీ అవమానకరమైన రీతిలో వెనుదిరగవలసి వచ్చింది. గత ఫైనలిస్ట్ ఫ్రాన్స్ బాటలోనే నడిచింది. కనీసం తొలి రౌండ్‌ను కూడా అధిగమించలేక అవమానభారంతో ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. గురువారం హోరాహోరీగా సాగిన తన చివరి మ్యాచ్ (గ్రూప్-ఎఫ్)లో ఇటలీ..2-3తో స్లొవేకియా చేతిలో ఓడింది. ఒక్క మ్యాచూ గెలవని ఆ జట్టు గ్రూపులో అట్టడుగున నిలిచింది. ముందుకెళ్లాంటే గెలవాల్సిన మ్యాచ్ లో ఇటలీ విఫలమైంది. స్థాయికి తగినట్లు ఆడలేకపోయింది.
ఐతే ఇటలీ ఆఖర్లో పుంజుకుని, పోరాటపటిమను ప్రదర్శించడంతో మ్యాచ్ అత్యంత రసవత్తరంగా ముగిసింది. కానీ ఇటలీ..స్లొవేకియా విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. రాబర్ట్ విటెక్ రెండు గోల్స్ (25, 73) చేసి స్లొవేకియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. కమిల్ కొపునెక్ (89) ఒక గోల్ సాధించాడు. ఇటలీ తరఫున నటాలె (81), క్వాగిలియరెలా (90+2) గోల్స్ కొట్టారు. నరాలు తెగేంత ఉత్కంఠభరితంగా సాగిన ఆఖరి క్షణాల్లో రెండు జట్ల ఆటగాళ్లు ఘర్షణపడ్డారు. ఇటలీ ఆటగాణ్ని చేత్తో కొట్టిన స్లొవేకియా గోల్‌కీపర్ పసుపు కార్డుకు గురయ్యాడు. 1974 తర్వాత ఇటలీ రెండో రౌండ్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications