Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొడుకు పుట్టాడని మ్యాచ్ మానేశాడు

Silva's Manchester City absence due to premature birth of baby son

హైదరాబాద్: మాంచెస్టర్ సిటీ మిడ్ ఫీల్డర్ డేవిడ్ సిల్వా ప్రీమియర్ లీగ్‌లోని మూడు మ్యాచ్‌లను వదులుకున్నాడు. కొడుకు పుట్టడమే దానికి కారణం. ఇటీవలే తన భార్య ఎస్సికా‌కు నెలలు నిండకుండానే కొడుకుకు జన్మనిచ్చింది.

అత్యవసరంగా తాను వెళ్లాల్సి రావడంతో మ్యాచ్‌ను వదిలేసి వెళ్లిపోయాడు. డిసెంబరు నెలలో టొట్టెన్‌హామ్ జట్టుతో లీగ్‌లో భాగంగా మాంచెస్టర్ సిటీ ఓ మ్యాచ్ ఆడింది. అందులో 4-1తేడాతో గెలుపొందిన సిల్వా ఇంటి దగ్గర నుంచి వార్త రావడంతో హుటాహుటిన బయల్దేరి వెళ్లిపోయాడు.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్న సిల్వా 'నాకు రోజూ పోరాటం లానే అనిపిస్తుంది. కొద్ది వారాల ముందు నెలల నిండాకుండానే పుట్టిన నా బిడ్డ ఇంకా ప్రాణాలతో పోరాడుతూనే ఉన్నాడు. అయినా వెళ్లాల్సిందే అని అడగగానే అనుమతిచ్చిన కోచ్ పెప్ గార్డియోలాకు, నా సహ ఆటగాళ్లకు కృతజ్ఞతలు. వారి సహాయం మర్చిపోను. నా పరిస్థితిని అర్ధం చేసుకుని సెలవు ఇప్పించారు.' అని పేర్కొన్నాడు.

సెలవుపై వెళ్లి వచ్చిన డేవిడ్ సిల్వా అత్యున్నత ప్రదర్శనను ఇచ్చి వాట్‌ఫర్డ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 3-1తేడాతో విజయాన్ని తెచ్చిపెట్టాడు. సిల్వా మాంచెస్టర్ సిటీ జట్టుతో నవంబరు నెలలో ఎతిహాద్ స్టేడియం వద్ద ఒప్పందం కుదుర్చుకున్నాడు. తర్వాత తన అసాధారణ ప్రతిభ చూపి లీగ్ మొత్తంలో ఐదు పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం సిటీ జట్టు పదిహేను పాయింట్లతో ప్రీమియర్ లీగ్ లోనే టాప్ 1 గా ఉంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 4, 2018, 13:01 [IST]
Other articles published on Jan 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+