Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత బాణాలపై ప్రతీకారం తీర్చుకుంటామంటున్న షిల్లాంగ్ జట్టు

Shillong Lajong eyeing revenge against Indian Arrows

హైదరాబాద్: షిల్లాంగ్‌లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా జనవరి 8వ తేదీ హీరో ఐ లీగ్ ఫుట్‌బాల్ మ్యాచ్ జరగబోతోంది. ఇదే లీగ్‌లో అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో 0-3తేడాతో చిత్తుగా ఓడిపోయిన షిల్లాంగ్ జట్టు సోమవారం జరగనున్న మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని యోచిస్తోంది.

అంతేగాక షిల్లాంగ్ జట్టు చెన్నై ఎఫ్‌సీతో తలపడి కూడా ఓడిపోవడంతో రెండు పరాజయాల అనంతరం బలమైన పట్టుదలతో పోరాడనుంది. ఈ సందర్భంగా షిల్లాంగ్ జట్టు కోచ్ స్పందిస్తూ..'మేము చెన్నై జట్టుతోనే నెగ్గాల్సి ఉంది. కానీ, గేమ్ ఆఖరులో తారుమారవడంతో నెగ్గలేకపోయాం.' అన్నాడు.

మరి సోమవారం జరగనున్న మ్యాచ్‌లో ఏ విధమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని అడిగిన ప్రశ్నకు మేమేంటో చూపిస్తాం. అలాంటప్పడు చెప్పాల్సిన అవసరమేముందని బదులిచ్చాడు.

ప్రత్యర్థి జట్టు ఇండియన్ ఏరోస్ కోచ్ మాట్లాడుతూ. 'మేము ఐ లీగ్‌లో ఆడినప్పుడు ఏ జట్టు అభిమానం పొందలేకపోయాం. ఎందుకంటే మేము అందరికంటే తక్కువ వయస్సున్న వాళ్లం. కానీ, మేమేంటో నిరూపించుకున్న తర్వాత మాకు ఆదరణ పెరిగింది. ఈ సారి ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఆడి ఇంకా మంచి ఫలితాలు అందుకుంటాం' అని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇరుజట్లకు సోమవారం జరగనున్న మ్యాచ్ హీరో లీగ్‌లోనే టర్నింగ్ పాయింట్‌గా
మారనుంది. షిల్లాంగ్ లో ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానున్న మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 8, 2018, 12:25 [IST]
Other articles published on Jan 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+