ఫుట్‌బాల్: శృంగారం ఆటగాళ్లకు మంచే చేస్తుంది!
బ్రెజిల్: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన ఆటగాళ్లకు కనీసం ఇప్పుడైనా వారి భాగస్వాములతో శృంగారంలో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని ఆ టీంల మేనేజ్‌మెంట్లు నిర్ణయించినట్లు బ్రెజిల్ మీడియా తెలిపింది. టోర్నీ జరుగుతున్న సమయంలో శృంగారంలో పాల్గొనకూడదని పలు జట్లకు ఇప్పటికే ఆయా జట్ల మేనేజ్‌మెంట్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
రెండు గంటల ముందు శృంగారంలో పాల్గొనడం వల్ల చేయబోయే పనిపై దాని ప్రతికూల ప్రభావం ఎంతమాత్రం ఉండబోదని పలు అధ్యయనాలు తేల్చాయని బ్రెజిల్స్ లాన్స్ పత్రిక తెలిపింది. 32 జట్లలో అన్ని మేనేజ్‌మెంట్లు ఆటగాళ్లపై శృంగార ఆంక్షలు పెట్టలేదనీ.. శృంగారంపై నిషేధం విధించినప్పటికీ బోస్నియా, చిలీ, మెక్సికో లాంటి జట్లు ఇంటిదారి పట్టాయని గుర్తు చేసింది.

నెదర్లాండ్స్, జర్మనీ లాంటి జట్లు శృంగారంపై ఎలాంటి ఆంక్షలు పెట్టనప్పటికీ ఆ రెండు జట్లు క్వార్టర్ ఫైనల్ చోటు దక్కించుకున్నాయని పేర్కొంది. ఈ రెండు జట్ల ఆటగాళ్లు తమ భాగస్వాములు, ప్రియురాళ్లతో ఆనందంగా గడిపారని తెలిపింది.
బ్రెజిల్ జట్టు ఆటగాళ్లకు జట్టు మేనేజర్ లూయిజ్ ఫిలిప్ కొంత వెసులుబాటును కల్పించాడు. సాధారణ శృంగారంలో పాల్గొనవచ్చని.. అతిగా చేయకూడదని ఆటగాళ్లకు సూచించాడు. శుక్రవారం జరిగే మ్యాచులో కొలంబియాపై విజయం సాధించడంతోపాటు ఆరోసారి ప్రపంచ కప్‌ను అందుకుంటుందనే విశ్వాసాన్ని లూయిజ్ ఫిలిప్ తెలిపారు. ఆటకు ముందు శృంగారంలో పాల్గొనడం వల్ల ఆటగాడు రిలాక్స్ అవుతాడని మరో మాజీ ఆటగాడు ఫార్వర్డ్ రోమరియో చెప్పాడు. ఆటకు ముందు, తర్వాత శృంగారంలో పాల్గొనవచ్చని అతడు తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications