Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FC Barcelona: మరో వికెట్.. మెస్సి బాటలో సాకర్ స్టార్: క్లబ్ నిండా మునిగినట్టే..

Sergio Aguero reportedly wants to leave FC Barcelona

బ్యూనస్ ఎయిర్స్: సాకర్ సూపర్‌స్టార్ లియోనల్ మెస్సి (Lionel Messi) తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ నుంచి వైదొలబోతోన్నానంటూ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. అతను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బార్సిలోనా ఎఫ్సీ పునాదులు కదలేలా చేస్తోంది. ప్రతిష్ఠను మసకబారేలా చేస్తోంది. ఎవరూ ఊహించని విధంగా లియోనన్ మెస్సీ.. ఇన్నాళ్లు తాను ఆడుతూ వచ్చిన ఎఫ్సీ బార్సిలోనాను వీడాలనుకునే నిర్ణయానికి వచ్చిన తరువాత.. తోటి ప్లేయర్లు సైతం అదే ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. మరో స్టార్ ప్లేయర్ కూడా ఎఫ్సీ బార్సిలోనాకు గుడ్‌బై చెప్పడానికి సమాయాత్తమౌతోన్నాడు.

కాంటాక్టుల గొడవ..

కాంటాక్టుల గొడవ..

మెస్సీ.. ఎఫ్సీ బార్సిలోనాను వీడటానికి ప్రధాన కారణం.. కాంట్రాక్ట్ రెన్యూవల్. లియోనల్ మెస్సీతో కుదుర్చుకున్న కాంటాక్ట్ ఇదివరకే ముగిసింది. దీన్ని పునరుద్ధరించాల్సి ఉందా క్లబ్. రెన్యూవల్ చేయడంలో కొంత జాప్యం ఏర్పడింది. దీనికి కూడా కారణాలు లేకపోలేదు. అర్జెంటీనా ప్రభుత్వం ఇటీవల కొన్ని రకాల రెగ్యులేషన్స్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో స్పోర్ట్స్ సెక్టార్‌ను కూడా చేర్చింది. క్రీడారంగాన్ని సైతం ఈ ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ పరిధిలోకి తీసుకుని రావడం వల్ల కాంటాక్ట్ గడువు ముగిసిన వెంటనే ఎఫ్సీ బార్సిలోనా దాన్ని పునరుద్ధరించలేకపోయింది.

స్పానిష్ క్లబ్స్ నుంచి..

స్పానిష్ క్లబ్స్ నుంచి..

ఇప్పుడు అవే ఆర్థికపరమైన రెగ్యులేషన్స్ ఎఫ్సీ బార్సిలోనా కొంప ముంచేలా చేస్తోన్నాయి. లియోనల్ మెస్సి తరువాత.. ఆ స్థాయిలో గ్లామర్ ఉన్నో స్టార్ ప్లేయర్ సెర్గియో అగుయెరా కూడా ఈ క్లబ్‌లో కొనసాగడంపై పునరాలోచనలో పడినట్టు సమాచారం. క్యాంప్ నొవుతో కుదుర్చుకున్న కాంటాక్ట్‌ను రద్దు చేసుకునే అంశాన్ని పరిశీలించాలంటూ సెర్గియో తన న్యాయవాదిని సూచించినట్లు తెలుస్తోంది. స్పానిష్ అవుట్‌ఫిట్స్ నుంచి అందుతోన్న ఆఫర్ల వల్ల అతను ఈ నిర్ణయానికి వచ్చినట్లు క్రీడా పండితులు అంచనా వేస్తోన్నారు. ఇదివరకు మాంచెస్టర్ సిటీ తరఫున ఆడిన ఈ స్టార్ స్ట్రైకర్ గత సమ్మర్ సీజన్‌లోనే ఎఫ్సీ బార్సిలోనాలో చేరాడు.

కాంటాక్ట్ రద్దుకే

కాంటాక్ట్ రద్దుకే

అతనితో రెండేళ్ల కాంటాక్ట్‌ను కుదుర్చుకుంది ఎఫ్సీ బార్సిలోనా. ఈ మేరకు వారిద్దరి మధ్య ఈ ఏడాది మార్చి 31వ తేదీన కాంటాక్ట్ కుదరింది. తాజాగా- అతను ఈ కాంటాక్ట్‌ను రద్దు చేసుకోవాలని భావిస్తోన్నాడు. ఈ ఒప్పందం ప్రకారం.. సెర్గియో 2023 మే వరకు ఎఫ్‌సీ బార్సిలోనాలో కొనసాగాల్సి ఉంటుంది. లియోనల్ మెస్సీ తీసుకున్న నిర్ణయం అతన్ని తీవ్రంగా ప్రభావితం చేసినట్టు కనిపిస్తోంది. అందుకే కాంటాక్ట్‌ను రద్దు చేసుకోవడంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అతని న్యాయవాది నుంచి సానుకూల సంకేతాలు అందిన వెంటనే సెర్గియో బార్సిలోనా క్లబ్‌ను వీడటం ఖాయమని కొన్ని స్పోర్ట్స్ వెబ్‌సైట్స్ వెల్లడించాయి.

రీప్లేస్ కోసం..

రీప్లేస్ కోసం..

లియోనల్ మెస్సీ తమ క్లబ్‌ను వీడటం వల్ల సంభవించిన నష్టాన్ని భర్తీ చేసుకునే పనిలో పడింది బార్సిలోనా. మెస్సీ రీప్లేస్ కోసం అన్వేషిస్తోంది. అతనికి ధీటుగా కొత్త ఫుట్‌బాలర్‌‌తో ఈ ఖాళీని పూరించడానికి పూనుకుంది. లియోనల్ మెస్సీ జట్టులో ఉన్న సమమంలో ఎఫ్‌సీ బార్సిలోనే అనేక టైటిళ్లను సొంతం చేసుకుంది. లా లిగా-10, కోపా డెల్ రే-7, ఛాంపియన్స్ లీగ్-4, ఫుట్‌బాల్ వరల్డ్ కప్-3లను గెలచుకుందా క్లబ్. తాను ఆడిన మ్యాచుల్లో 20 సార్లు మెస్సీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆరు సార్లు బాల్లన్ డీ ఆర్‌ను అందుకున్నాడు. అదే సమయంలో మరో స్టార్ స్ట్రైకర్ సెర్గియో వైదొలగాలనుకోవడం కలకలం పుట్టిస్తోంది.

Story first published: Saturday, August 7, 2021, 15:03 [IST]
Other articles published on Aug 7, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+