న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

సాకర్ కప్ సంరంభానికి సౌదీ ప్రిన్స్.. స్పెయిన్ ఒక్కటే ఫేవరెట్ కాదు

Saudi crown prince to attend FIFA World Cup opening ceremony in Moscow

హైదరాబాద్: రష్యా అంతటా సాకర్ ఫీవర్ ఆవరించింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా యావత్ ప్రభుత్వం ఆతిథ్య ఏర్పాట్లపైనే కేంద్రీకరించింది. సరిగ్గా వచ్చే గురువారం మాస్కో నగరం సాకర్ కప్ సంరంభం ప్రారంభానికి వేదిక కానుంది. మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో ఆతిథ్య రష్యా, సౌదీ అరేబియా జట్లు తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి.

తొలి మ్యాచ్‌కు హాజరు కానున్న సౌదీ రాజు

తొలి మ్యాచ్‌కు హాజరు కానున్న సౌదీ రాజు

ఈ మ్యాచ్‌కు హాజరయ్యేందుకు సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని సల్మాన్ వ్యక్తిగత అధికారి బాదర్ అల్ అసకేర్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశారు. తొలిసారి ఫిఫా వరల్డ్ కప్‌కు రష్యా ఆతిథ్యం ఇస్తోంది. మాస్కోలో రెండు స్టేడియంలతోపాటు 11 నగరాల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నది. గ్రూప్ ‘ఎ'లో రష్యాతోపాటు సౌదీ అరేబియా, ఈజిప్టు, ఉరుగ్వే జట్లు ఆడనున్నాయి.

స్పెయిన్ ఒక్కటే హాట్ ఫేవరెట్ కాదు:

స్పెయిన్ ఒక్కటే హాట్ ఫేవరెట్ కాదు:

రష్యాలో జరుగనున్న ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో స్పెయిన్ జట్టు ఒక్కటే హాట్ ఫేవరెట్ కాదని ఆ జట్టు మాజీ కోచ్ విసెంటే డెల్ బాస్ క్యూ తెలిపారు. 2010 సాకర్ కప్ టైటిల్‌ను ఎగరేసుకుపోయిన స్పెయిన్ జట్టు.. మరో వారంలో ప్రారంభమయ్యే సంరంభంలో మిగతా ఫేవరెట్ జట్లలో స్పెయిన్ ఒక్కటని చెప్పాడు.

అదృష్టం కూడా కలిసి రావాలంటూ:

అదృష్టం కూడా కలిసి రావాలంటూ:

వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభానికి ముందు జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్‌లు స్పెయిన్ జట్టుకు సానుకూలం, వారిలో శక్తిని ఇనుమడింపజేస్తాయన్నారు విసెంటె డెల్ బాస్ క్యూ తెలిపాడు. మంచి ఆటగాళ్లు, మంచి కోచ్, అభిమానులతోపాటు అదృష్టం కూడా కలిసి రావాల్సి ఉందని చెప్పాడు. స్పెయిన్ జట్టు గ్రూప్ ‘బీ'లో పోర్చుగల్, ఇరాన్, మొరాకో జట్లతో తలపడనుంది.

 మెస్సీని ప్రధాన అస్త్రంగా వాడనున్న ఇజ్రాయెల్

మెస్సీని ప్రధాన అస్త్రంగా వాడనున్న ఇజ్రాయెల్

ఫుట్‌బాల్ గ్లోబల్ స్టార్ ప్లేయర్ లియానెల్ మెస్సీని ఇజ్రాయెల్ తన రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నదని పాలస్తీనా ఫుట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జిబ్రిల్ రాజౌబ్ ఆరోపించారు. అర్జెంటీనాతో ఫ్రెండ్లీ మ్యాచ్‌ను ఇజ్రాయెల్ రద్దు చేసుకోవడమే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. రాజకీయాలను, క్రీడలను ఇజ్రాయెల్ కలగాపులగం చేస్తోందని చెప్పారు. అర్జెంటీనా జట్టుకు లియానెల్ మెస్సీ సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. నిబంధనలకు భిన్నంగా ఈ మ్యాచ్ ను హైపా సిటీలో జరుగాల్సి ఉన్నా.. జెరూసలేంకు మార్చేశారని ఆరోపించారు. ఇది ఐక్యరాజ్యసమితి తీర్మానాలు, అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకం అని తెలిపారు.

Story first published: Thursday, June 7, 2018, 11:38 [IST]
Other articles published on Jun 7, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X