సలాహ్‌కు గాయం: కప్‌పై ఆశలొదులుకున్న ఈజిప్ట్

హైదరాబాద్: అత్యంత భారీ అంచనాలతో జూన్ నెల 14వ తేదీ నుంచి నెల రోజుల పాటు రష్యాలో జరిగే సాకర్ కప్ సంరంభంలో పాల్గొన్న కప్ గెలుచుకోవడం కష్ట సాధ్యమేనని ఈజిప్టు ఫుట్ బాల్ అసోసియేషన్ (ఈఎఫ్ఎ) భయపడుతోంది. లివర్‌పూల్ జట్టులో ఆడుతున్న కీ ప్లేయర్ మహ్మద్ సాలాహ్‌కు గాయం కావడమే దీనికి కారణంగా కనిపిస్తుంది. చాంపియన్స్ లీగ్ టోర్నీ ఫైనల్స్‌లో రియల్ మాడ్రిడ్ జట్టు చేతిలో లివర్ పూల్ టీం 3 -1 స్కోర్ తేడాతో ఓటమి పాలైంది. సెర్జియో రామోస్ నుంచి సవాల్‌ను ఎదుర్కోబోయి భుజానికైన గాయంతో ఒక్కసారిగా నేల కూలాడు మొహమ్మద్ సలాహ్.

మొహమ్మద్ సలాహ్‌కు గాయం సీరియస్
లివర్‌పూల్ మేనేజర్ జుర్గెన్ క్లోప్ మాట్లాడుతూ మొహమ్మద్ సలాహ్ సమస్య నిజంగానే సీరియస్‌గా ఉన్నదని తాము వైద్య పరీక్షల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. దీంతో వచ్చేనెలలో జరిగే ప్రపంచకప్ టోర్నమెంటులో కప్ గెలుచుకోవడం మాట అటుంచి, టోర్నమెంట్‌లో పాల్గొనడమే అనుమానమన్నాడు. మొహమ్మద్ సలాహ్ భుజానికి గాయమైందని ఎక్స్ రే స్పష్టంగా కనిపిస్తోందని టీం డాక్టర్లు చెప్తున్నారు. భుజం ఎముక తీవ్రంగా దెబ్బతిన్నదని తెలిపారు.

15న ఉరుగ్వేతో ఈజిప్టు డీ
అయితే జూన్ 15న ‘గ్రూప్ ఎ' విభాగంలో ఉరుగ్వే జట్టుతో జరిగే తొలి మ్యాచ్ నాటికి ఫిట్‌నెస్ సాధించగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు. తాజాగా ప్లేయర్ల పరిస్థితిపై లివర్‌పూల్ తాజాగా ఎటువంటి అప్‌డేట్ విడుదల చేయలేదు.

గోల్స్ సాధనలో మెస్సీ టాప్
ఛాంపియన్స్ లీగ్ టోర్నమెంట్ ఫైనల్స్ ముగిసిన తర్వాత గోల్స్‌లో బార్సిలోనా ఫార్వర్డ్ ప్లేయర్ లియానెల్ మెస్సీ మొదటి స్థానంలో నిలిచాడు. ఐదు టోర్నమెంట్లలో కలిసి 54 గేమ్స్‌లో 45 గోల్స్ గెలుచుకుని మొదటి స్థానంలో ఉన్నాడు. మొహమ్మద్ సలాహ్, క్రిస్టియానో రొనాల్డో తర్వాతీ స్థానాల్లో నిలిచాడు. అన్ని లీగ్‌లలో మెరుగైన ఆటతీరు ప్రదర్శించినందుకు లియానెల్ మెస్సీ గోల్డెన్ షూ కూడా అందుకున్నాడు.

2017 - 18లో గోల్స్ సాధించిన ప్లేయర్లు వీరే
లియానెల్ మెస్సీ - 54 మ్యాచ్‌లు - 45 గోల్స్
మొహమ్మద్ సలాహ్ - 52 మ్యాచ్‌లు - 44 గోల్స్
క్రిస్టియానో రొనాల్డో - 44 మ్యాచ్‌లు - 44 గోల్స్
రాబర్ట్ లెవాండోవస్కీ- 48 మ్యాచ్‌లు - 41 గోల్స్
హర్రీ కానె - 48 మ్యాచ్‌లు - 41 గోల్స్
కిరో ఇమ్మోబిల్ - 47 మ్యాచ్‌లు - 41 గోల్స్
ఎడింసోన్ కావాని - 48 మ్యాచ్‌లు - 40 గోల్స్
లూయిస్ సౌరెజ్ - 51 మ్యాచ్‌లు - 31 గోల్స్
పీఈ ఔబామేయంగ్- 38 మ్యాచ్‌లు - 31 గోల్స్
సెర్జియో అగౌరో - 39 మ్యాచ్‌లు - 30 గోల్స్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications