
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మకమైన 2018 పుస్కాస్ అవార్డు ఈజిప్టు ఫుట్‌బాల్ వీరుడు మొహమ్మద్ సలాహ్‌ను వరించిందవి. ఎవర్టన్ జట్టుకు ప్రత్యర్థిగా పోరాడుతున్న లివర్‌పూల్ జట్టుకు సలాహ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఛాంపియన్ లీగ్‌లో ప్రదర్శన ఆధారంగా ఈ అవార్డు కోసం ఇప్పటికే పలువురిని నామినేట్ చేసిన ఈజిప్ట్ అంతార్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య సలాహ్ దీనికి అన్ని విధాల అర్హుడని నిర్దారించింది.
విశేషమేమిటంటే అవార్డు కోసం నామినేట్ అయిన వారిలో ఫుట్‌బాల్ దిగ్గజాలు బార్సిలోనా స్టార్ క్రిస్టియన్ రొనాల్డో, అర్జెంటీనా హీరో లియోనల్ మెస్సీలు కూడా ఉన్నారు. కేవలం ఛాంపియన్ షిప్ ప్రదర్శననే కాకుండా రష్యా వేదికగా జరిగిన ప్రపంచ కప్ గోల్‌లను సైతం పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో రష్యాకు చెందిన డేనిస్ చెరిషె, ఫ్రాన్స్‌కు చెందిన బెంజమిన్ పవారర్డ్, పోర్చుగల్‌కు చెందిన రికార్డొ ఖురేష్మాలు నామినేటెడ్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన పుస్కాస్ అవార్డు గతేడాది ఒలివియర్ గిరౌడ్ దక్కించుకున్నారు.
ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అర్సెనల్‌పై క్రిస్టల్ పాలెస్ జరిపిన సంరంభం ఆధారంగా ఒలివియర్‌ను ఈ అవార్డు వరించింది. గతంలో ఈ అవార్డు గెలుచుకున్నవారి పేర్లు ఇలా ఉన్నాయి. జేమ్స్ రొడ్రిగేజ్, జ్లాటన్ ఇబ్రహీంమొవిక్, నేమార్‌లు గాక ఇంకొందరు స్టార్ ప్లేయర్లు క్రీడా విభాగం నుంచి ఎంపికైయ్యారు.