Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ పెప్ టాక్: కేరళ కుర్రాళ్లలో ఉత్తేజం

కోచి: తన క్రీడాకారుల్లో ఉత్సాహం, ఉత్తేజం నింపేందుకు కేరళ బ్లాక్ బస్టర్స్ యజమాని సచిన్ టెండూల్కర్ పూనుకున్నాడు. ముంబై సిటీతో మ్యాచ్ గెలుచుకున్న తన జట్టు క్రీడాకారులను లంచ్ కు ఆహ్వానించాడు మాస్టర్ బ్లాస్టర్. ముంబై సిటీతో విజయానికి ముందు మాట్లాడేందుకు వెనుకాడే బ్లాక్ బస్టర్స్ కుర్రాళ్లు.. తమకు అత్యంత సమీపంలో మాస్టర్ బ్లాస్టర్ ప్రత్యక్షమయ్యే సరికి ఉబ్బ తబ్బిబ్బయ్యారు.

కేరళ బ్లాస్టర్స్ షర్ట్ తో సచిన్ చాలా సింపుల్ గా తమకు అత్యంత సమీపంలోకి రావడం మహ్మద్ రఫీ వంటి ప్లేయర్లకు ఇదే తొలిసారి. మహ్మద్ రఫీ వంటి వారంతా సచిన్ తమకు చేరువలో కనిపించడంతో ఆశ్చర్య చకితులయ్యారు.

రఫీ మాట్లాడుతూ 'సచిన్ టెండూల్కర్ ను అత్యంత సన్నిహితంగా చూడటం నా వంటి వారికి అత్యంత అరుదైన చాన్స్. నేను మాట్లాడే అవకాశం కోసం ప్రయత్నిస్తా. అసలు ఆయన తమ వద్దకు వస్తారని నేను నమ్మలేదు' అని చెప్పాడు. 'మాతో సచిన్ ఎక్కువ మాట్లాడలేదు. తన కెరీర్ లో ఎదురైన ఒడిదొడుకులనే పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగాలని హితవు చెప్పాడు. కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మనోధైర్యాన్ని కోల్పోలేదని మాకు హితవు చెప్పాడు' అని రఫీ వ్యాఖ్యానించాడు.

Sachin Tendulkar’s pep talk motivated Kerala Blasters to earn their first ISL win

'అదే సమయంలో మ్యాచ్ లలో ఓటమి పాలైనా నమ్మకం, విశ్వాసం కోల్పోవద్దని మాకు చెప్పాడు. తన కెరీర్ లో కష్ట కాలం ఎదురైనప్పుడు కూడా తాను భయపడలేదని చెప్పాడు. ప్లేయర్లందరితో 20 నిమిషాల సేపు ముచ్చటించి మాలో ప్రేరణ పెంపొందించేందుకు ప్రయత్నించాడు' అని రఫీ అన్నాడు.

రెండు వరుస పరాజయాలు, ఒక మ్యాచ్ డ్రా తర్వాత డీ మోరలైజ్ అయిన కుర్రాళ్లలో ఉత్తేజాన్ని నింపాలని సచిన్, కోచ్ స్టీవ్ కొప్పెల్ నిర్ణయానికొచ్చారు. ఈ నేపథ్యంలో జట్టు సభ్యులందరితో కలిసి లంచ్ చేశారు. అయితే ముంబై సిటీతో విజయం తర్వాత సచిన్ వారితో కలిసిపోవడం యాద్రుచ్చికంగా జరిగిందే.

శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్ ను సచిన్ తన సతీమణి అంజలీతో కలిసి వీక్షించడం గమనార్హం. ఈ మ్యాచ్ లో సీనియర్ ఆటగాడు మిఖైల్ చోప్రా చేసిన గోల్.. సచిన్ దంపతులను పరవశంలో ముంచెత్తింది. ఈ గోల్ తోనే ముంబైపై కేరళ బ్లాక్ బస్టర్స్ విజయం సాధించింది మరి.

మెస్సీ మరో ఆల్ టైం రికార్డు

బార్సిలోనా ఎఫ్ సి క్లబ్ ప్లేయర్ లియానెల్ మెస్సీ గోల్స్ లో మరో ఆల్ టైం రికార్డు సాధించాడు. డెపోర్టివోపై శనివారం జరిగిన మ్యాచ్ లో అథ్లెటిక్ లెజెండ్ టెల్మో జర్రా సాధించిన 179 లీగ్ గోల్స్ ను అధిగమించాడు. తద్వారా లా లీగా లీగ్ టోర్నీలోనే మెస్సీ రికార్డు నెలకొల్పాడు. బార్సిలోనా సొంత గడ్డపై జరిగిన ఈ మ్యాచ్ లో 4 - 0 స్కోర్ తేడాతో డెపోర్టివోపై విజయం సాధించింది.

లా లీగా లీగ్ లో మరో జెయింట్ క్లబ్ రియల్ మాడ్రిడ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిస్టియానో రొనాల్డో పై 150 గోల్స్, అల్ర్ఫెడో డీ స్టెఫానో గోల్స్ 151గా నమోదయ్యాయి. గోల్స్ రికార్డుల్లో క్రిస్టియానో రొనాల్డోది నాలుగోస్థానం. ఇప్పటికే టాప్ స్కోరర్ గా రికార్డు నెలకొల్పిన మెస్సీ.. తాజా రికార్డుతో మరో చరిత్ర నెలకొల్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+