For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రష్యా Vs సౌదీ అరేబియా: ఎనిమిది నెలలుగా విజయం లేని రష్యా

By Nageshwara Rao
Russia v Saudi Arabia preview: World Cup starts in Moscow

హైదరాబాద్: రష్యా తొలిసారిగా నిర్వహిస్తున్న ఫిఫా వరల్డ్ కప్‌కు సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు గాను ప్రపంచవ్యాప్తంగా పది లక్షలకుపైగా మంది ఇప్పటికే రష్యాకు చేరుకున్నారు. మొత్తం 11 నగరాల్లో 12 ఆధునిక హంగులతో సిద్ధం చేసిన 12 స్టేడియాలు ఈ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి.

ఇది 21వ ఫిఫా వరల్డ్ కప్ కావడం విశేషం. మొత్తం 32 జట్లు ఎనిమిది గ్రూలుగా విడిపోయి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఆతిథ్య జట్టు హోదాలో రష్యా గ్రూప్‌-ఎలో బరిలో నిలిచింది. జూన్ 28వ వరకు గ్రూప్‌ దశ పోటీలు ఉంటాయి. ఎనిమిది గ్రూప్‌ల్లోని నాలుగేసి జట్లు... మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్‌లో పోటీ పడతాయి.

1
958022

గత ఎనిమిది నెలలుగా విజయం లేని రష్యా

ప్రతి గ్రూప్‌లో టాప్‌-2 జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి. 30 నుంచి నాకౌట్‌ దశ మొదలవుతుంది. జూలై 15న జరిగే తుదిపోరుతో టోర్నీ ముగుస్తుంది. తొలి మ్యాచ్‌లో భాగంగా ఆతిథ్య రష్యాతో.. సౌదీ అరేబియా తలపడనుంది. గత ఎనిమిది నెలలుగా ఒక్క విజయం సాధించని రష్యా జట్టుపై ఆందోళన నెలకొంది.

కెప్టెన్ స్టాన్సిస్లావ్ చెర్చెసోవ్ మాయ చేసేనా?

కెప్టెన్ స్టాన్సిస్లావ్ చెర్చెసోవ్ మాయ చేసేనా?

స్టాన్సిస్లావ్ చెర్చెసోవ్ నేతృత్వంలోని రష్యా జట్టు ఫిఫా ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 70వ స్థానంలో కొనసాగుతోంది. గ్రూప్‌ఏలో ఉరుగ్వే, ఈజిప్ట్‌లతోపాటు ఉన్న సౌదీ అరేబియా కూడా ర్యాంకింగ్స్‌లో రష్యా కంటే ముందుండడం గమనార్హం. మరోవైపు 2006 తర్వాత ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌కు సౌదీ అరేబియా అర్హత సాధించింది.

సౌదీపై అంచనాలు లేవు

సౌదీపై అంచనాలు లేవు

దీంతో సౌదీ జట్టుపై సాకర్ అభిమానులకు పెద్దగా అంచనాలు లేవు. సౌదీ జట్టులో ప్రస్తుతం వినిపిస్తోన్న పేరు ఫహాద్ అల్ మువాల్లాద్. గతేడాది సెప్టెంబర్‌లో జపాన్‌తో జరిగిన అర్హత మ్యాచ్‌లో రాణించాడు. అనుభవం కలిగిన ఆటగాడు కూడా. లెగానెస్ క్లబ్ తరఫున ఎంపికైనా మరో ఆటగాడు యహియా అల్ శేరి ఇప్పటికీ కనీసం ఒక్క మ్యాచ్‌లో ఆడలేదు.

క్వాలిఫయిర్ మ్యాచ్‌లలో 16 గోల్స్

క్వాలిఫయిర్ మ్యాచ్‌లలో 16 గోల్స్

చివరగా, మహ్మద్ అల్ సహ్లావి క్వాలిఫయిర్ మ్యాచ్‌లలో 16 గోల్స్ చేసినప్పటికీ, గత తొమ్మిది మ్యాచ్‌లలో ఒక్క గోల్ కొట్టలేకపోవడం జట్టుకు పెద్ద మైనస్‌గా మారింది. రష్యాతో జరిగే ఆరంభ మ్యాచ్‌లో మాత్రం సౌదీ అరేబియా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ, సొంత మైదానంలో ప్రేక్షకులు మద్దతుతో రష్యా పోరాడే అవకాశం లేకపోలేదు.

జట్లు అంచనా:

రష్యా: ఇగోర్ అకిన్‌ఫీవ్, మారియో ఫెర్నాండెస్, ఫెదోర్ కుద్య్రోసోవ్, సెర్గీ జాన్సెవిచ్, యూరి ఝిర్కోవ్, రోమాన్ జోబ్నిన్, డాలెర్, అలాన్ జాంజోవ్, ప్యోడోర్ స్మోలోవ్, సామెదోవ్, గొలోవిన్.

సౌదీ అరేబియా: అబ్దుల్లా అల్ మేయూఫ్, ఉస్మాహ్ హుసావి, ఒమర్ హోసావి, యాసీర్ అల్ షరాని, మహ్మద్ అల్ బారిక్, అబ్దుల్లా ఒటిఫ్, సాల్మన్ అల్ ఫరాజ్, యాహ్యా అల్ షహరి, జాసిమ్, ఫహాద్ అల్ మోలాద్, మహ్మద్ సలావి.

Story first published: Thursday, June 14, 2018, 15:10 [IST]
Other articles published on Jun 14, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+