Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా కప్ ఎఫెక్ట్: ఉక్రెయిన్ సరిహద్దు మూసేసిన రష్యా

Russia to tighten security measures on border with Ukraine ahead of World Cup

హైదరాబాద్: వచ్చేనెల 14వ తేదీ నుంచి రష్యాలో సాకర్ కప్ సంరంభం ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో రష్యా తన సరిహద్దు దేశం ఉక్రెయిన్ పొడవునా భద్రతా చర్యలు పటిష్ఠం చేసింది. టాస్ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యాలోని రొస్టోవ్ రీజియన్ గవర్నర్ వాసిలీ గొలుబేవ్ టాస్ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. రొస్టోవ్ సెక్టార్ రష్యా - ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉంది. 660 కిలోమీటర్ల పొడవునా సరిహద్దు విస్తరించింది. 400 కిలోమీటర్ల భూ సరిహద్దులు ఉన్నాయి.

టోర్నీ సందర్భంగా సుమారు 800 వాలంటీర్లు

టోర్నీ సందర్భంగా సుమారు 800 వాలంటీర్లు

రీజనల్ అథారిటీ అధికారులు ప్రపంచ కప్ టోర్నీ సందర్భంగా సుమారు 800 వాలంటీర్లు, కోస్సాక్ యూనిట్లు శాంతిభద్రతల పరిరక్షణపై ద్రుష్టి సారించింది ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ నిర్వాహక కమిటీ. రొస్టోవ్ ఆన్ డాన్ నగరం అంతటా అదనంగా మూడువేల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు.

 సరిహద్దు భద్రతా గార్డుల సంఖ్య పెంచాం

సరిహద్దు భద్రతా గార్డుల సంఖ్య పెంచాం

రొస్టోవ్ రీజియన్ గవర్నర్ వాసిలీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘సరిహద్దుల్లో భద్రతా చర్యలు కఠినతరం చేశాం. సరిహద్దు భద్రతా గార్డుల సంఖ్య పెంచాం. వరల్డ్ కప్ వేదికల వద్ద బందోబస్తు పెంచాం. అదనంగా పోలీసు బలగాలు విధులు నిర్వహిస్తున్నాయి. వరల్డ్ కప్ జోన్లు,అంతే కాదు యావత్ రీజియన్ పరిధిలో అదనపు పోలీసులు విధులు నిర్వర్తించారు' అని చెప్పారు.

 2018 ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో వివిధ జట్ల షెడ్యూల్

2018 ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో వివిధ జట్ల షెడ్యూల్

2018 ఫిఫా వరల్డ్ కప్ తొలిసారి రష్యాలో జరగనుండటంతో ఆ దేశం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఈ టోర్నీలో జట్లను గ్రూపు ఏ నుంచి ఎఫ్ వరకు ఆరు గ్రూపులుగా విభజించారు.

గ్రూప్ ఏలో ..ఆతిథ్య రష్యా, సౌదీ అరేబియా, ఈజిప్టు, ఉరుగ్వే జట్లు

గ్రూప్ బీలో.. పోర్చుగల్, స్పెయిన్, ఇరాన్, మొరాకో

గ్రూపు సీలో.. ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, పెరు, డెన్మార్క్

గ్రూపు డీలో.. అర్జెంటీనా, ఐస్ లాండ్, క్రొయేషియా, నైజీరియా

గ్రూపు ఇలో.. బ్రెజిల్, స్విట్జర్లాండ్, కొస్టారికా, సెర్బియా

గ్రూపు ఎఫ్‌లో.. జర్మనీ, మెక్సీకో, స్వీడన్, దక్షిణ కొరియా

గ్రూపు జీ.. విభాగంలో బెల్జియం, ట్యునీషియా, పనామా, ఇంగ్లండ్

గ్రూపు హెచ్.. విభాగంలో పోలండ్, కొలంబియా, సెనెగల్, జపాన్

జూన్ 17వ తేదీన బ్రెజిల్, స్విట్జర్లాండ్..

జూన్ 17వ తేదీన బ్రెజిల్, స్విట్జర్లాండ్..

రొస్టోవ్ ఎరీనా స్టేడియంలో జూన్ 17వ తేదీన బ్రెజిల్, స్విట్జర్లాండ్.. 20వ తేదీన ఉరుగ్వే, సౌదీ అరేబియా ఆడతాయి. దక్షిణ కొరియా, మెక్సికో మధ్య మ్యాచ్ జూన్ 23వ తేదీన జరుగుతుంది. జూన్ 26వ తేదీన ఐస్ లాండ్, క్రొయేషియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.

Story first published: Wednesday, May 30, 2018, 13:43 [IST]
Other articles published on May 30, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+