
హైదరాబాద్: 2018లో రష్యా అతిథ్యమిస్తోన్న ఫిఫా వరల్డ్ కప్ పోటీలకు సంబంధించి డ్రాను నిర్వాహకులు శుక్రవారం విడుదల చేశారు. ప్రారంభ మ్యాచ్‌లో భాగంగా ఆతిథ్య రష్యా... సౌదీతో తలపడనుంది. ఇక, 2010 విజేత స్పెయిన్, యూరోపియన్ చాంపియన్ పోర్చుగల్ జట్లు ఒకే గ్రూప్‌లో పోటీపడనున్నాయి.
బరిలో ఉన్న మొత్తం 32 జట్లను 8 గ్రూప్‌లుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లో 4 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ ఎనిమిది గ్రూప్‌ల్లో గ్రూప్-డి, గ్రూప్-ఎఫ్‌లు కఠినంగా కనిపిస్తున్నాయి. ఈసారి ఆతిథ్య రష్యాకు సులువైన డ్రా ఎదురైంది. గ్రూప్-ఎలో రష్యాతో పాటు.. సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఉరుగ్వే జట్లున్నాయి.
ఇక గ్రూప్-బిలో పోర్చుగల్, స్పెయిన్, మొరాకో, ఇరాన్ ఉండగా... గ్రూప్-సిలో ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, పెరూ, డెన్మార్క్ జట్లున్నాయి. గ్రూప్-డిలో అర్జెంటీనా.. గ్రూప్-ఎఫ్‌లో జర్మనీ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. గ్రూప్-డిలో అర్జెంటీనా, ఐస్‌లాండ్, క్రొయేషియా, నైజీరియా ఉండగా... గ్రూప్-ఈలో బ్రెజిల్, స్విట్జర్లాండ్, కోస్టారికా, సెర్బియా జట్లున్నాయి.
1958, 1962లో బ్రెజిల్ వరుసగా రెండుసార్లు ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత మరే జట్టు ఆ ఘనత సాధించలేదు. డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ, మెక్సికో, స్వీడన్, దక్షిణ కొరియా గ్రూప్-ఎఫ్‌లో ఉన్నాయి. గ్రూప్-జిలో బెల్జియం, పనామా, ట్యూనిషియా, ఇంగ్లండ్... గ్రూప్-హెచ్‌లో పోలెండ్, సెనెగల్, కొలంబియా, జపాన్‌లు ఉన్నాయి.
వచ్చే ఏడాది జూన్ 14న మాస్కోలో ఆతిథ్య రష్యా, సౌదీ అరేబియా మధ్య మ్యాచ్‌తో ప్రపంచకప్ ఫుట్‌బాల్ ఆరంభంకానుంది. డ్రా విడుదల కార్యక్రమంలో దిగ్గజాలు మారడోనా, పీలే పాల్గొన్నారు.
Group A: రష్యా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఉరుగ్వే
Group B: పోర్చుగల్, స్పెయిన్, మొరాకో, ఇరాన్
Group C: ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, పెరూ, డెన్మార్క్
Group D: అర్జెంటీనా, ఐస్‌లాండ్, క్రొయేషియా, నైజీరియా
Group E: బ్రెజిల్, స్విట్జర్లాండ్, కోస్టారికా, సెర్బియా
Group F: జర్మనీ, మెక్సికో, స్వీడన్, దక్షిణ కొరియా
Group G: బెల్జియం, పనామా, ట్యూనిషియా, ఇంగ్లండ్
Group H: పోలెండ్, సెనెగల్, కొలంబియా, జపాన్