For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిఫా వరల్డ్ కప్ 2018: స్టేడియాల్లోకి కొకైన్, గంజాయి, హెరాయిన్ కొట్టొచ్చు

By Nageshwara Rao
Russia stadiums to allow cocaine, cannabis and heroin at 2018 fifa world cup

హైదరాబాద్: ఫిఫా వరల్డ్ కప్‌కు హాజరయ్యే అభిమానులకు రష్యా శుభవార్తను ప్రకటించింది. 2018లో రష్యా ఆతిథ్యమిస్తోన్న ఫిఫా వరల్డ్ కప్‌ పుట్‌బాల్ మ్యాచ్‌లకు హాజరయ్యే అభిమానులు తమ వెంట కొకైన్, గంజాయి, హెరాయిన్ తెచ్చుకునేందుకు వీలు కల్పించింది. అయితే ఇందుకు సంబంధించి పూర్తి మెడికల్ డాక్యుమెంట్లు ఉండాలనే నిబంధన విధించింది.

ఫిఫా వరల్డ్ కప్ 2018కి సంబంధించిన పూర్తి సమాచారం కోసం

బెలారస్, కజకిస్థాన్, రష్యా దేశాలు కలిగి ఉన్న మాస్కోకు చెందిన యురాసిన్ ఎకనమిక్ యూనియన్ (ఈఏఈయు) కమిటీ మెడికల్ డాక్యుమెంట్స్ లేకుండా ఫిఫా వరల్డ్ కప్‌కు నిషేధం విధించిన నార్కోటిక్, సైకోట్రోపిక్ డ్రగ్స్‌ను అనుమతించేది లేదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఫిఫా వరల్డ్ కప్‌ మ్యాచ్‌లకు హాజరయ్యే విదేశీయులు మాత్రం సరైన పేపర్ ప్రిస్క్రిప్షన్‌తో తమ వెంట కొకైన్, గంజాయి, హెరాయిన్ లాంటి వస్తువులను తీసుకొచ్చుకోవని రష్యా నేతృత్వంలోని యూనియన్ సభ్య దేశాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధలన్నీ విదేశీయులు తప్పక పాటింటాల్సిందేనని పేర్కొంది.

ఈ ఏడాది జూన్-జులైలో జరిగే ఫిఫా వరల్డ్ కప్‌కు రష్యా ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను రష్యా సిద్ధం చేసింది. ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లను వీక్షించడానికి వచ్చే అభిమానులు తమ వెంట నార్కోటిక్, సైకోట్రోపిక్ డ్రగ్స్‌ను తమ వెంట తెచ్చుకునేలా ఫిఫా నిబంధనలు అనుమతిస్తాయి.

వీటికి సంబంధించి అభిమానులు మెడికల్ డాక్యుమెంట్లను రష్యా లేదా ఇంగ్లీషులో అధికారులకు చూపించాల్సి ఉంటుందని స్థానిక న్యూస్ పేపర్‌లో వార్త వెలువడింది. ప్రేక్షుకులకు వర్తించే రష్యా ఫెడరేషన్ నిబంధలన్నీ వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిస్తోన్న 11 పట్టణాల్లో అమలవుతాయని అందులో పేర్కొంది.

వరల్డ్ కప్ నేపథ్యంలో మాస్కో, సెయింటి పీటర్స్ బర్గ్, సోచి వేదికల్లో పొగత్రాగడంపై నిషేధం విధించింది. రష్యా వరల్డ్ కప్ ఆర్గనైజింగ్ కమిటీ మంగళవారం నార్కోటిక్, సైకోట్రోపిక్ డ్రగ్స్‌ను అనుమతికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశంలోని వివిధ చెక్ పాయింట్లలో ఈ డ్రగ్ ప్రిస్క్రిప్షన్ ప్రామాణికతను ధ్రువీకరించేందుకు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

జూన్ 14 నుంచి జులై 15 వరకు రష్యా వేదికగా జరిగే ఫిఫా వరల్డ్ కప్‌లో కొకైన్, కొడైన్, మోర్ఫిన్, అమ్ఫేటమిన్లు, గంజాయిలను అభిమానులు తమవెంట తెచ్చుకునేందుకు రష్యా అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి 2015 ఈసీఈ నిబంధనలు ప్రకారమే తాము నడుచుకుంటున్నామని రష్యా స్పష్టం చేసింది.

2018 ఫిఫా వరల్డ్ కప్‌ బరిలో దిగే 32 జట్లు:
1. రష్యా
2. బ్రెజిల్
3. ఇరాన్
4. జపాన్
5. మెక్సికో
6. బెల్జియం
7. దక్షిణ కొరియా
8. సౌదీ అరేబియా
9. జర్మనీ
10. ఇంగ్లాండ్
11. స్పెయిన్
12. నైజీరియా
13. కోస్టా రికా
14. పోలాండ్
15. ఈజిప్ట్
16. ఐస్లాండ్
17. సెర్బియా
18. పోర్చుగల్
19. ఫ్రాన్స్
20. ఉరుగ్వే
21. అర్జెంటీనా
22. కొలంబియా
23. పనామా
24. సెనెగల్
25. మొరాకో
26. ట్యునీషియా
27. స్విట్జర్లాండ్
28 క్రొయేషియా
29. స్వీడన్
30. డెన్మార్క్
31. ఆస్ట్రేలియా
32. పెరు

Story first published: Friday, March 2, 2018, 11:08 [IST]
Other articles published on Mar 2, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+