వరల్డ్ కప్: చెవిటి పిల్లే జోస్యంతో పాటు... పంది, సిట్టా అనే ఏనుగు కూడా


హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో చెవిటి పిల్లి అచెల్లె చెప్పిన జోస్యం నిజమైంది. గురువారం ఆరంభ వేడుకల అనంతరం మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా జట్టు సౌదీ అరేబియాపై 5-0తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌కి ముందు ఆరంభ మ్యాచ్‌లో గెలుపెవరిది? అంటే.. ఆతిథ్య జట్టు రష్యాకే తన ఓటు అని చెవిటి పిల్లి అచిల్లె తేల్చిన సంగతి తెలిసిందే. సరిగ్గా చెవిటి పిల్లి అచిల్లె చెప్పినట్లే రష్యా విజయం సాధించింది. అయితే ఇలా జంతువులు వేసిన అంచనాలు నిజం అవ్వడం ఇది తొలిసారేం కాదు.
గత కొన్నేళ్లుగా ప్రతి ఫిఫా వరల్డ్ కప్‌కు ఏదో ఓ జంతువు అభిమానులకు ఇలా తన అంచనాలతో ఆశ్చర్యపరుస్తూనే ఉంది. అలాంటి జంతువుల గురించి తెలుసుకుందాం...
అచెల్లె అనే చెవిటి పిల్లి
రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్న జంతువు పిల్లి. ఇది చెవిటిది. ఆరంభ మ్యాచ్‌లో సౌదీ అరేబియాను రష్యా ఓడిస్తుందన్న అచెల్లె చెప్పిన జోస్యం నిజమైంది. 2017 కాన్ఫెడరేషన్స్ కప్ విజేతను కూడా అచెల్లె ఇది సరిగ్గా ఊహించడం విశేషం.

పాల్ అనే అక్టోపస్
ఈ సముద్ర జంతువు పాల్‌ను అందరికీ సుపరిచతమే. 2010 వరల్డ్ కప్ సందర్భంగా తన అంచనాలతో ఫుట్‌బాల్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. జర్మనీలోని సీలైఫ్ సెంటర్ నిర్వాహకులు.. ఆహారంతో పాటు వెలుపలి వైపు రెండు దేశాల జెండాలు ఉన్న పెట్టెలను పాల్‌కు అందుబాటులో ఉంచేవాళ్లు. అది ఏ పెట్టెను పట్టుకుంటే ఆ జట్టు గెలుస్తుందని అర్థమన్నమాట. అలా జర్మనీ ఆడిన ఏడు మ్యాచ్‌ల ఫలితాలను కూడా అది సరిగ్గా ఊహించింది.

మార్కస్ అనే పంది
తాజాగా రష్యా వరల్డ్ కప్ సందర్భంగా జోస్యం చెప్పేందుకు ఓ పంది కూడా ముందుకొచ్చింది. ఫలితాలు ఊహించడంలో మార్కస్‌ది 100 శాతం రికార్డు అని దాని బ్రిటిష్ యజమాని చెబుతున్నాడు. నైజీరియా, బెల్జియం, ఉరుగ్వే, అర్జెంటీనా సెమీఫైనల్ వెళ్తాయని ఇప్పటికే ఈ పంది జోస్యం చెప్పింది. ఆయా దేశాల జెండాలు గుచ్చి ఉన్న యాపిల్‌లను తినడం ద్వారా ఇది ఫలితాలను అంచనా వేస్తుంది.

సిట్టా అనే ఏనుగు
పోలెండ్‌లోని క్రకో జంతు ప్రదర్శనశాలలో ఉందిది. ఈ వరల్డ్ కప్‌లో తన దేశం ఆడే మ్యాచ్‌ల ఫలితాలను ఇది అంచనా వేస్తోంది. పండును ఎంచుకోవడం ద్వారా సిట్టా విజేతను ఊహిస్తుంది. బుధవారం జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో లితువేనియాపై పోలెండ్ గెలుస్తుందని ఇది చెప్పిన జోస్యం నిజమైంది.

బుజ్జి పాండాలు
2014 వరల్డ్‌కప్ సందర్భంగా ఈ పిల్ల పాండాలు అభిమానులను విపరీతంగా ఆకర్షించాయి. దేశాల పేర్లతో ఉన్న బుట్టలను ఎంచుకోవడం ద్వారా లేదా చెట్లు ఎక్కడం ద్వారా ఇవి విజేతలను అంచనా వేస్తాయి. చైనాలోని ఓ సంరక్షణ కేంద్రంలో ఈ పాండాలు ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications