2018 ఒలంపిక్స్‌కు రష్యాపై నిషేదం

హైదరాబాద్: అధికార యంత్రాంగం నుంచి జరిగిన పొరబాటుకు తప్పు చేసిన వాళ్లే కాకుండా అందరూ శిక్షలో పాలుపంచుకుంటున్నారు. 2014లో రష్యాలో జరిగిన టోర్నీలో తమ ఆటగాళ్లు నిషేదిత ఉత్ప్రేరకాలు వాడారని వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వకపోవడమే ఇందుకు కారణం.
అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ రష్యా ఆటగాళ్లు ఉత్ప్రేరకాలు వాడారని అందుకు వాళ్ల అధికారులే సహకరించారని వివరణ కోరింది. దానికి స్పందించకపోగా రియో ఒలంపిక్స్‌లో పాల్గొని ఏకంగా 19 స్వర్ణాలు సాధించింది. విజేతల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచిన రష్యా తమ అథ్లెట్లు డోపింగ్‌కు పాల్పడలేదని నిరూపిస్తేనే తప్ప 2018 వింటర్ ఒలంపిక్స్‌కు అర్హత సాధించలేరు.

తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించడంలో ఏ నష్టం లేదు. కానీ, ఏ పాపం తెలీని వాళ్లని కూడా ఇందులో భాగం చేయడం భావ్యం కాదేమో. అంతర్జాతీయ డోపింగ్ ఏజన్సీ(డబ్ల్యూఏడీఏ) రష్యా యాంటీ డోపింగ్ ఏజన్సీ (ఆర్‌యూఎస్ఏడిఏ)ని 2015 లో పోటీలకు అనర్హం అంటూ నిషేదించిన విషయం తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications