
హైదరాబాద్: నైమర్ బార్సిలోనా జట్టులో చేరిన కొన్నేళ్లకే ఖరీదైన ఆటగాడిగా ఎదిగాడు. పారిస్ సెయింట్ జర్మైన్ క్లబ్ ఇతన్ని 200 మిలియన్ బ్రిటిషు పౌండ్లకు (వెయ్యి కోట్ల రూపాయలు) సొంతం చేసుకుంది.
25 ఏళ్ల వయస్సున్న నైమర్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. 26 గేమ్ లలో ఆడిన ఇతను 24 సార్లు స్కోరు చేసి రికార్డును నెలకొల్పాడు.
దీంతో మెస్సీ తన మాజీ జట్టు ఆటగాళ్లతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతటి తీవ్రమైన పోటీని తట్టుకుని నిలవాలంటే ఇంకా కష్టపడాల్సి ఉంది.
క్రిస్టియన్ రొనాల్డొ కంటి పక్క భాగంలో గాయం కావడంతో కొద్ది రోజులుగా విశ్రాంతి తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం నైమర్‌కు స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీ ఒక్కడే ఉన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.