Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మా రోనాల్డోకు ఇది కొత్త కాదు: పోర్చుగల్ డిఫెండర్

పేలవ ఫామ్‌తో సతమతమవుతూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రోనాల్డోకు ఆ జట్టు డిఫెండర్ రూబెన్ డయాస్ అండగా నిలిచాడు. ఈ విమర్శలు, మీడియా ఒత్తిడి రోనాల్డోకు కొత్త కాదని, తన కెరీర్‌లో ఇలాంటి కఠిన పరిస్థితులను ఎన్నో ఎదుర్కొన్నాడని తెలిపాడు. ఫలితాలు అనుకూలంగా లేనప్పుడు ఇలాంటి విమర్శలు రావడం సహజమని, వాటిని తాము అస్సలు పట్టించుకోమని స్పష్టం చేశాడు.

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పోర్చుగల్ తమ తొలి మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపర్చింది. పసికూన కాంగోతో జరిగిన తమ తొలి మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించింది.మ్యాచ్ ఆరంభంలోనే జోనో నెవీస్ హెడర్ ద్వారా పోర్చుగల్‌కు ఆధిక్యం అందించినప్పటికీ.. ఫస్ట్ హాఫ్ ముగిసేలోపే కాంగో ఆటగాడు యోవాన్ విస్సా గోల్ కొట్టి స్కోరును సమం చేశాడు.

ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ కేవలం ఏడు షాట్లు మాత్రమే కొట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రపంచకప్ చరిత్రలో ఆ జట్టుకు ఇది అత్యల్ప సంఖ్య (2002లో సౌత్ కొరియాతో మ్యాచ్‌లో కూడా 7 షాట్లు కొట్టారు). 46వ ర్యాంకులో ఉన్న కాంగో జట్టు, పోర్చుగల్ కంటే ఎక్కువ షాట్లు (8) కొట్టడం గమనార్హం.

Ruben Dias Defends Cristiano Ronaldo and Dismisses External Noise After Portugal s Lackluster World Cup Opener

ఫామ్ లేమితో రొనాల్డో సతమతం..

ఈ పేలవ ప్రదర్శన తర్వాత స్టార్ స్ట్రైకర్ క్రిస్టియానో రొనాల్డో తీవ్ర విమర్శలపాలయ్యాడు. 41 ఏళ్ల రొనాల్డో కీలక అంతర్జాతీయ టోర్నీల్లో (వరల్డ్ కప్/యూరో) వరుసగా 10 మ్యాచ్‌ల నుంచి ఒక్క గోల్ కూడా నమోదు చేయలేదు. అతని అంతర్జాతీయ కెరీర్‌లో ఇదే అత్యంత సుదీర్ఘమైన గోల్‌లెస్ రన్. 90 నిమిషాల పాటు మైదానంలో ఉన్న రొనాల్డో కేవలం 25 సార్లు మాత్రమే బంతిని తాకగలిగాడు. అతను చేసిన మూడు గోల్ ప్రయత్నాలు కూడా టార్గెట్‌ను చేరలేకపోయాయి.

విమర్శలను పట్టించుకోం..

తమ జట్టుపై వస్తున్న విమర్శలను పోర్చుగల్ డిఫెండర్ రూబెన్ డయాస్ కొట్టిపారేశాడు. 'ఈ విమర్శలేవీ మాకు ముఖ్యం కాదు. మ్యాచ్ సరిగ్గా సాగనప్పుడు ఇలాంటి విమర్శలు రావడం సహజం. వాటికి మేం దూరంగా ఉంటున్నాం. రొనాల్డోకు ఇలాంటి మీడియా ఒత్తిడిని ఎదుర్కోవడం కొత్తేమీ కాదు.'అని డయాస్ పేర్కొన్నాడు.

ఆప్టా సూపర్‌కంప్యూటర్ అంచనాల ప్రకారం పోర్చుగల్ నాకౌట్ (రౌండ్ ఆఫ్ 32) చేరేందుకు 91.8% అవకాశాలు ఉన్నప్పటికీ, గ్రూప్ టాపర్‌గా నిలిచే అవకాశం 40.9% కి పడిపోయింది. పోర్చుగల్ తన తదుపరి మ్యాచ్‌లో మంగళవారం ఉజ్బెకిస్తాన్‌తో తలపడనుంది. నాకౌట్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం పోర్చుగల్‌కు అత్యంత కీలకం.

Story first published: Saturday, June 20, 2026, 9:48 [IST]
Other articles published on Jun 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+