Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విజయమంతా గోల్ కీపర్స్ చేతులోనే, రేయ్.. నువ్వు గోల్ కొట్టు..

RTÉ hands leading goalkeepers a starring role in World Cup team

హైదరాబాద్: ప్రపంచమంతా ఫుట్‌బాల్ గురించి ఎదురుచూస్తున్న వేళ.. సాకర్ సమరంలో ఏ జట్టుకైనా తుది ప్రత్యర్థి గోల్ కీపరే. ఎంతటి వేగంతో వచ్చే బంతినైనా చాకచక్యంగా ఆపేయగలిగేవాడు అతనొక్కడే.
ఏడాది క్రితం విడుదలైన టాలీవుడ్ సినిమా 'అర్జున్ రెడ్డి'లో హీరో క్యారెక్టర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో హీరో ఎంట్రీ సీన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌తోనే మొదలవుతోంది. రేయ్.. నువ్వు గోల్ కొట్టరా.. బల్‌మట్టా సెంటర్‌లో బట్టలిప్పి తిరుగుతా' అంటూ గోల్ కీపర్‌గా ఉన్న హీరో ఛాలెంజ్ చేస్తాడు. అంతటి తెగువతో ఉంటారు గోల్ కీపర్లు.

జిమ్నాస్ట్‌లా శరీరాన్ని విల్లులా వంచుతూ..పక్షిలా గాల్లోకి ఎగురుతూ.. మిసైల్ వేగంతో ముందుకు కదులుతూ.. బంతిని ఆపేందుకు కష్టపడాలి. ఇంతా చేసినా బంతి దొరుకుతుందన్న గ్యారంటీ లేదు.. బంతిని ఆపిన సమయంలో వచ్చే ప్రశంసల కన్నా..గోల్ వదిలిన సమయంలో వచ్చే విమర్శలు అధికం.

ఆట అంతా గోల్‌కీపర్ చేతుల్లోనే

ఆట అంతా గోల్‌కీపర్ చేతుల్లోనే

ఫలితం నిర్దేశించేందుకు పెనాల్టీషూటౌట్ అనివార్యమైతే.. అప్పుడు ఆట అంతా గోల్‌కీపర్ చేతుల్లోనే ఉంటుంది. ఇందులోనూ విజయం నిర్దేశం కాకపోతే సడెన్‌డెత్ ద్వారా ఫలితం తేలుస్తారు. అప్పుడు గెలిచిన జట్టు గోల్‌కీపర్ హీరోగా మారితే..ఓడిన గోల్‌కీపర్ విలన్‌గా విమర్శలపాలవుతాడు. ఇలా అసమాన గోల్‌కీపింగ్ నైపుణ్యాలతో స్టార్లుగా మారిన గోల్‌కీపర్లకు ప్రపంచకప్‌లో భలే గిరాకీ.. తాజా ప్రపంచకప్‌లో స్టార్ గోల్‌కీపర్ల విన్యాసాలపై ప్రత్యేక కథనం..

సమరోత్సాహంతో రంగంలోకి దిగనున్న గోల్ కీపర్లు:

సమరోత్సాహంతో రంగంలోకి దిగనున్న గోల్ కీపర్లు:

ఈ ప్రపంచకప్‌లో అలిసన్ బెకర్(బ్రెజిల్), డేవిడ్ జియా(స్పెయిన్), మాన్యుయెల్ న్యూయెర్(జర్మనీ), ఎస్సామ్ అల్ హదారీ(ఈజిప్టు), రుయ్ పాట్రిసియో(పోర్చుగల్) స్టార్‌గోల్‌కీపర్లుగా ప్రేక్షకులను అలరించేందుకు రంగంలోకి దిగనున్నారు. అసమాన విన్యాసాలతో జట్టుకు విజయాన్నించేందుకు సమరోత్సాహంతో రంగంలోకి దిగనున్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని శాసించే అలిసన్ బెకర్ ఆరోసారి బ్రెజిల్ జట్టును విశ్వవిజేతగా నిలిపేక్రమంలో కీలకంగా మారనుండగా.. డిఫెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి దిగుతున్న జర్మనీ జట్టుకు న్యూయెర్..45 ఏండ్లకు చేరినా..ఈజిప్టు ఆశలను మోస్తున్న హదారీ, పోర్చుగల్ ఆశలను మోస్తున్న పాట్రిసియో, స్పెయిన్ బలం డేవిడ్ జియా అలరించేందుకు రెఢీ అంటున్నారు.

రూ. 670 కోట్ల జీతంతో అలిసన్ బెకర్:

రూ. 670 కోట్ల జీతంతో అలిసన్ బెకర్:

బ్రెజిల్ అమ్ములపొదిలోని పదునైన అస్త్రం 25 ఏళ్ల అలిసన్ బెకర్.. ప్రపంచంలోనే అత్యంత విలువైన గోల్‌కీపర్. ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఇతనికి 10కోట్ల డాలర్లు ( మన కరెన్సీలో దాదాపు రూ.670 కోట్లు) అంటే కళ్లు తిరుగక మానవు. డి బాక్స్ ఏరియాలో స్ట్రయికర్ ఎంత మొనగాడైనా బెకర్ ముందు దిగడుపు కావాల్సిందే. ఆట ప్రారంభం నుంచి ముగిసేదాకా గోల్‌పోస్టును కాపాడుతూ జట్టుకు విజయాన్నందించడంలో ఈ యువకెరటం కీలకపాత్ర పోషిస్తుంటాడు.. 2014లో సొంతగడ్డపై జరిగిన పిఫా ప్రపంచకప్‌లో జట్టు సెమీస్‌లోనే ఓడడంతో బ్రెజిల్ తీవ్రమైన కుంగుబాటుకు గురైంది.

ఆరంభంలోనే అడ్డుకట్ట వేసే న్యూయెర్:

ఆరంభంలోనే అడ్డుకట్ట వేసే న్యూయెర్:

ప్రపంచకప్‌లాంటి మెగా ఈవెంట్లలో రాణించడంలో 32 ఏళ్ల మాన్యుయెల్ న్యూయెర్‌ది అందెవేసిన చేయి. కోచ్ వ్యూహాలకు తగినట్లుగా రాణించడం.. మ్యాచ్ ఆరంభంలోనే జర్మనీపై ప్రత్యర్థులు గోల్ చేయనీకుండా చేయడంలో అతని సామర్థ్యం నిజంగా అద్భుతం. అందుకే జర్మనీ ఫార్వర్డ్ ప్లేయర్లు మరింత స్వేచ్ఛగా దూకుడుగా ఆడి ప్రత్యర్థులపై పైచేయిని సాధించేలా జట్టుకు ప్రేరణనిస్తాడు. వరుసగా గాయాలు వేధించడంతో 2017-18 సీజన్‌లో బేయర్న్ మ్యూనిచ్ క్లబ్ తరఫున కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ ప్రపంచకప్‌లో అతను పూర్తిస్థాయిలో చెలరేగితే ప్రత్యర్థి స్ట్రయికర్లకు కంటిమీద కునుకుండదు..

45 ఏళ్ల ఎస్సామ్ అల్ హదారీ(ఈజిప్టు)

45 ఏళ్ల ఎస్సామ్ అల్ హదారీ(ఈజిప్టు)

హదారీ 45.. వయసులో ఫుట్‌బాల్ ఆడగలరంటే నమ్మడమే కష్టం.. కానీ అతనే జట్టు కెప్టెన్ అంటే..పిఫా ప్రపంచకప్ అర్హత మ్యాచ్‌లలో అదురగొట్టి ..జట్టును ఫైనల్స్‌కు తీసుకెళ్లాడంటే మరింత ఆశ్చర్యమే కదా... ఎంతో ఫిట్‌నెస్..మరెంతో చురుకుదనం.. అనుక్షణం అప్రమత్తతగా ఉండాల్సిన గోల్‌కీపర్‌గా అంటే ..నమ్మలేం కదా.. కానీ ఈజిప్టు గోల్‌కీపర్ ఎస్సామ్ అల్ హదారీ మాత్రం వయసు అంకె మాత్రమే అని నిరూపించాడు. 1996లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హదారీ..తాజాగా రష్యాలో జరిగే పిఫా ప్రపంచకప్ ఫైనల్స్ ఆడడంతో తన కలను నెరవేర్చుకున్నాడు. అర్హత మ్యాచ్‌లలో స్టార్ స్ట్రయికర్ మొహ్మద్ సలాహ్ రాణింపుతో ఈజిప్టు ప్రపంచకప్ బెర్తు సాధించిందనే చెబుతారు.. కానీ కెప్టెన్‌గా..గోల్‌కీపర్‌గా రెండు పాత్రలను సమర్థంగా నిర్వహిస్తూ సవ్యసాచిలా జట్టును నడిపిస్తూ అదరగొడుతున్నాడు. కనీసం ఈజిప్టు రెండోరౌండ్ చేరినా.. అల్ హదారీ కష్టానికి తగిన ఫలితం సమకూరినట్లే..

Story first published: Friday, June 8, 2018, 16:26 [IST]
Other articles published on Jun 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+