న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌కు దూరం కాబోతున్న రోసిక్కి

 Rosicky retires as rigours of playing become too much

హైదరాబాద్: మాజీ అర్సినల్ స్టార్ టోమష్ రోసిక్కీ తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించబోతున్నాడు. 37 సంవత్సరాల రోసిక్కీ ఆట గెలవాలంటూ వస్తున్న ఒత్తిడులు ఎదుర్కోలేక సెలవు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.

పద్దెనిమిదేళ్ల క్రితం రోసిక్కీ ఫుట్‌బాల్ క్రీడలో అడుగుపెట్టాడు. ఈ ప్రయాణంలో గన్నర్స్, బోరష్యా డార్ట్‌మండ్, స్పార్టా ప్రాగ్ టీంలతో కలిసి ఆడాడు. తన దేశానికి మొత్తం 105 గౌరవ పురస్కారాలు తెచ్చిపెట్టాడు. స్వదేశంలో మూడో ర్యాంకును పొందిన రోసిక్కీ, పీటర్ కెచ్, కారెట్ పోబర్‌స్కీ ల తర్వాతి స్థానంలో కొన్నేళ్ల పాటు కొనసాగాడు.

'నా శరీరం అంతకుముందులా సహకరించట్లేదు అందుకే నేను ఫుట్ బాల్ నుంచి తప్పుకుంటున్నా. నేను నా టీం స్పార్టాకు చాలా కృతజ్ఞుడ్ని. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ జట్టే కారణం. నేను ప్రియాతి ప్రియంగా భావించే ఈ మైదానానికి గుడ్ బై ' అంటూ భావోద్వేగానికి గురైయ్యాడు.

డార్ట్‌మండ్ టీంతో కలిసి ఆడిన రోసిక్కి 2001-02లో గెలిచిన బుందెస్లిగా ఛాంపియన్ షిప్ టైటిల్‌లో భాగమయ్యాడు. కొన్నేళ్ల విరామం తర్వాత గతేడాది ఫుట్ బాల్ రంగంలోకి మళ్లీ అడుగుపెట్టి రెండు ఫుట్‌బాల్ అసోసియేషన్ మ్యాచ్ లలో కప్ గెలుచుకునేందుకు తోడ్పడ్డాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 20, 2017, 17:28 [IST]
Other articles published on Dec 20, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X