Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సౌతాఫ్రికా సంచలన విజయం

ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ (AFCON)టోర్నీలో సౌతాఫ్రికా సంచలన విజయాన్నందుకుంది. కేప్ వెర్డె జట్టుతో శనివారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో షూటౌట్‌లో 2-1 తేడాతో గెలుపొందింది. ఈ సంచలన విజయంతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.

నిర్ణీత సమయంతో పాటు ఎక్స్‌ట్రా టైమ్‌లోనూ ఇరు జట్లు 0-0తో ఒక్క గోల్ కూడా నమోదు చేయకపోవడంతో మ్యాచ్ ఫలితాన్ని షూటౌట్‌ ద్వారా తేల్చారు. సౌతాఫ్రికా గోల్‌కీపర్ రాన్వెన్ విలియమ్స్ నాలుగు గోల్స్‌ను అడ్డుకొని సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Ronwen Williams saves a penalty

1996‌లో ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ టైటిల్ గెలుచుకున్న సౌతాఫ్రికా.. 28 ఏళ్ల కలను సాకారం చేసుకునేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచింది. సెమీఫైనల్లో నైజీరియాతో తలపడనుంది.

ఈ చివరి లీగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కంటే కేప్ వెర్డే జట్టే మెరుగైన ప్రదర్శన చేసింది. గోల్స్ సాధించేందుకు అనేక అవకాశాలను సృష్టించుకుంది. కానీ చివరి నిమిషంలో తడబడి గోల్స్ నమోదు చేయకపోవడంతో పాటు ఫలితాన్ని రాబట్టలేకపోయింది.

ఈ మ్యాచ్ ఫస్టాఫ్‌లో గోల్ కీపర్స్‌కు పనేలేకుండా పోయింది. కెవిన్ పినాకు గోల్ చేసే అవకాశం దక్కినా అది వైడ్‌గా వెళ్లింది. దాంతో కేప్ వెర్డె ఖాతా తెరవలేకపోయింది. సౌతాఫ్రికా డిఫెన్స్ విభాగాన్ని చేధిస్తూ కేప్‌వెర్డె ప్లేయర్లు చేసినా ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాంతో ఇరు జట్లు నిర్ణీత సమయంలో గోల్స్ చేయలేకపోయాయి.

ఎక్స్‌ట్రా టైమ్‌తో గేమ్ కొనసాగించినా ఫలితం తేలలేదు. ఎక్స్‌ట్రా టైమ్‌లో సౌతాఫ్రికా జోరు కనబర్చినా గోల్ సాధించలేకపోయింది. కేప్‌వెర్డ్ డిఫెన్స్ విభాగం సౌతాఫ్రికా ఆటగాళ్లను అద్భుతంగా అడ్డుకుంది.
దాంతో షూటౌట్‌ ఆడించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

షూటౌట్‌లో కేప్‌వెర్డ్ ప్లేయర్లు, మాంచెస్టర్ యునైటెడ్ మాజీ ఫార్వార్డ్ బెబే, విల్లీ సెమెడో కొట్టిన కిక్స్‌ను సౌతాఫ్రికా కీపర్ విలియమ్స్ అద్భుతంగా అడ్డుకోవడంతో ఆధిక్యం లభించింది. ఆ తర్వాత సఫారీ ప్లేయర్ జఖేలే లెపాసా బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించడంలో విఫలమవడంతో.. కేప్‌ వెర్డే జట్టులో ఆశలురేకెత్తాయి.

కానీ విలియమ్స్.. లారో డువార్డే ప్రయత్నాన్ని అడ్డుకొని వారి ఆశలపై నీళ్లు జల్లాడు. ఆబ్రే మోడిబా‌ను వోజిన్వా అడ్డుకోగా.. బ్రయాన్ టీక్సిరా కేప్ వేర్డే ఖాతా తెరిచాడు. మోతోబి మ్వాలా గోల్ కొట్టి సఫారీ ఆధిక్యాన్ని డబుల్ చేశాడు. పాట్రిక్ ఆండ్రేడ్ గోల్‌ను అడ్డుకొని విలియమ్స్ సౌతాఫ్రికా విజయాన్ని లాంఛనం చేశాడు.

Story first published: Sunday, February 4, 2024, 9:28 [IST]
Other articles published on Feb 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+