Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రేయసితో నగ్నంగా రొనాల్డో, ప్రియురాలితో పెళ్లికి రొరీ నో

మాడ్రిడ్/లండన్: ప్రపంచకప్‌కు ముందు స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో నటించిన ఓ అడ్వర్టయిజ్‌మెంట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. క్రిస్టియానో రొనాల్డో తన ప్రియురాలు ఇరీనా షేక్‌తో కలిసి చేసిన ఈ వాణిజ్య ప్రకటనలో రొనాల్డో నగ్నంగా ఉన్నాడు. పెరూ ఫోటోగ్రాఫర్ దీనిని తీశారు.

ప్రపంచవ్యాప్తంగా కొట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ పోర్చుగల్ ఆటగాడు నగ్నంగా ఓ ప్రకటనకు ఫోజులు ఇవ్వడం ఇదే మొదటిసారి. క్రిస్టియానో రొనాల్డో గొప్ప ఫుట్‌బాల్ ఆటగాడు కాగా ఆయన ప్రియురాలు ఇరీనా షేక్ ప్రముఖ మోడల్.

Ronaldo with girlfriend

ఇదిలా ఉండగా... ఛాంపియన్ లీగ్ విషయమై రియల్ మాడ్రిడ్ బాస్ కార్లో అన్సెలోట్టి మాట్లాడుతూ... క్రిస్టియానో రొనాల్డో, గరెత్ బేల్‌లు ఛాంపియన్స్ లీగ్ ఫైనల్‌ను ప్రారంభిస్తారని చెప్పారు.

పెళ్లికి సిద్ధంగా లేనని రోరీ మెకిల్ రోయ్

ప్రపంచ మాజీ నంబర్ వన్ క్రీడాకారిణి కరొలిన్ వొజ్నియాకితో ప్రేమాయణం సాగిండం వరకూ సరేగానీ పెళ్లికి మాత్రం కాదని బ్రిటన్ గోల్ఫర్ రొరీ మెకిల్‌రొయ్ తేల్చి చెప్పాడు. ప్రేమించిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే వివాహానికి మాత్రం ససేమిరా అన్నాడు. పెళ్లి శుభలేఖను అందరికీ పంచిన తర్వాత తాను పెళ్లికి సిద్ధంగాలేనని అతను ప్రకటించడం సంచలనానికి కారణమైంది. చాలాకాలంగా వీరిద్దరి ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది.

ఈ ఏడాది జనవరి ఒకటిన త్వరలోనే వివాహం చేసుకోనున్నట్టు ఇద్దరూ ప్రకటించారు. ఇటీవల పెళ్లి కూడా ఖాయమైంది. శుభలేఖలు పంచడం పూర్తయింది. అయితే మెకిల్‌రొయ్ హఠాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం తాను వివాహానికి తయారుగా లేనని పేర్కొన్నాడు. వొజ్నియాకి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత కంటే ఎక్కువగా చెప్పలేనని, వొజ్నియాకితో వివాహం జరగదని అతను తెలిపాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+