For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అతనొక్కడే: గెలుపు, ఓటములను మార్చగల వ్యక్తి

Ronaldo the man for the big occasion

హైదరాబాద్: రియల్ మాడ్రిడ్ జట్టుకు, క్రిస్టియానొ రొనాల్డోకు ఈ సంవత్సరం బాగా కలిసొచ్చింది. ఓటమెరుగని క్రీడాకారుడిలా దూసుకుపోతున్న రొనాల్డో.. పోర్చుగీసు దేశస్థుడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో బార్సిలోనా అవార్డు, ఐదు ట్రోఫీలను అందుకున్నాడు. రొనాల్డో జట్టులో ఆడుతున్నాడంటే టీం పూర్తిగా అతనిపైనే ఆధారపడి ఉంటుంది.

Ronaldo wants to retire at Real Madrid

గొప్ప అద్భుతాలు చేయడంలో రొనాల్డో ముందుంటాడు. ఛాంపియన్ లీగ్‌లో అత్యధిక స్కోరు సాధించడమే కాకుండా ఫైనల్‌‌లో లీగ్ కప్పును సైతం సొంతం చేసుకున్నాడు. గ్రీమియో జట్టుతో తలపడిన రొనాల్డో అప్పుడు స్పానిష్ క్లబ్ తరపున ఆడాడు. ఈ మ్యాచ్‌లో తన 34వ ఫ్రీ కిక్ తో గోల్ చేసి కాంటినెంటల్ గెలుచుకున్నాడు.

అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ స్టేడియంలో మీడియా సమావేశంలో పాల్గొన్న రొనాల్డో 'బార్సిలోనా జట్టుతో గడపడం నాకు చాలా తృప్తినిచ్చింది. నాకు నంబర్ల మీద నమ్మకం లేదు. అది తమ గొప్ప చెప్పుకోవడానికే పనికొస్తుంది. నాకు నా ప్రతిభ చూపించడం ఇష్టం. నేను మరో టైటిల్‌ను గెలుచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు రియల్ మద్రిద్ జట్టు వరుసగా ఐదు ట్రోఫీలు గెలుచుకోలేదు. కానీ మేము ఇప్పుడు అలా చేయాలని ఆశపడుతున్నాం' అని చెప్పుకొచ్చాడు.

అయితే రొనాల్డోను రియల్ మద్రీద్ క్లబ్ బాగా ఇబ్బంది పెడుతుందన్న రూమర్లు లేకపోలేదు. దానికి స్పందించిన రొనాల్డో. . ఈ క్లబ్‌కి ఇన్‌ఛార్జి నేను కాక ఎవరనుకుంటున్నారు. అని జోక్ చేశాడు. అనంతరం తాను ఎప్పుడు వెళ్లిపోవాలనుకుంటే అప్పుడు రాజీనామా చేసి వెళ్లిపోగలనని తనకి ఎలాంటి బలవంతాలు లేవని స్పష్టం చేశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, December 18, 2017, 17:51 [IST]
Other articles published on Dec 18, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+