
హైదరాబాద్: ఫుట్‌బాల్ ప్రపంచ వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు లియోనల్ మెస్సీనే టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. అయితే ఆ రికార్డును దాటేయాలన్న కసితో క్రిస్టియనొ రొనాల్డో ప్రస్తుతం ఉన్నట్లు కనిపిస్తుంది. డిసెంబరు 7వ తేదీన ప్రకటించిన అవార్డుల్లో రొనాల్డో ఐదో బాల్లోని డీ ఆర్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే ఇప్పటివరకు మెస్సీ నాలుగు అవార్డులను మాత్రమే కలిగి ఉన్నాడు. ఆ విషయంలో ఇప్పటికే దాటేసినట్టే అది కాదన్నట్లు ఇప్పుడు టాప్ గోల్ స్కోరర్ గా ఉన్న రికార్డును కూడా తన ఖాతాలో వేసుకోనున్నాడు.

ఫుట్‌బాల్ ప్రపంచ కప్ సిరీస్ లో భాగంగా బుధవారం రియల్ మద్రీద్ జట్టుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన అల్ జజీరా జట్టుకు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మద్రీద్ జట్టు తరపున ఆడిన రొనాల్డో గోల్ కోసం తాపత్రయ పడి చివరికి పెనాల్టీ కార్నర్ కూడా వదిలిపెట్టలేదు.
ప్రపంచ స్థాయి ఆటగాళ్లలో ఇప్పటివరకు లియోనల్ మెస్సీ, లూయిస్ స్క్వార్జ్, సీజర్ డెల్గాడో తొలి అయిదు స్థానాల్లో ఉన్నారు. వీళ్ల వరుసలోనే ఉన్నా రొనాల్డో వీరి తర్వాతి స్థానంలో ఉండటంతో వారిని దాటేందుకు ప్రయత్నిస్తున్నాడు.
డిసెంబరు నెల ముందు వరకు జరిగిన అన్ని మ్యాచ్‌లలో రొనాల్డో వ్యక్తిగత స్కోరు అందరికంటే టాప్‌గా ఉంది. లీగ్ మొత్తానికి టాప్ స్కోరర్‌గా ఉన్న రొనాల్డో మొట్ట మొదటి స్థానానికై ఆశపడుతున్నాడు. ఈ అవార్డు కూడా పొందితే రొనాల్డో జాబితాలో మరో రికార్డు చేరిపోనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.