Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రొనాల్డో స్ట్రయిక్: క్లబ్ వరల్డ్ కప్ ఫైనల్స్‌కు మాడ్రిడ్

యొకొహామా: కరీం బెంజెమా, క్రిస్టియానో రొనాల్డో చెరో గోల్ చేయడంతో ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ ఫైనల్స్‌లోకి రియల్ మాడ్రిడ్ జట్టు ప్రవేశించింది. గురువారం జపాన్‌లోని యొకోహమాలో జరిగిన సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లో మెక్సికో క్లబ్ అమెరికా జట్టుపై 2 - 0 స్కోర్‌తో విజయం సాధించింది.

జే లీగ్ చాంపియన్లు కషిమా అంట్లేర్స్ జట్టుపై స్పానిష్ జెయింట్స్ రియల్ మాడ్రిడ్ జట్టు ఆదివారం యొకొహమాలో తలపడనున్నది. మూడేళ్లలో రియల్ మాడ్రిడ్ రెండోసారి, కషిమా అంట్లేర్స్ ఐదోసారి.. ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ టైటిల్ కోసం తలపడనున్నాయి. 'మా పూర్తి లక్ష్యం ఫైనల్స్‌కు చేరుకోవడమే. ఆ మేరకు లక్ష్య సాధన పూర్తయింది' అని రియల్ మాడ్రిడ్ హెడ్ కోచ్ జినెడినె జిడానె మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాకు చెప్పారు.

Ronaldo strikes as Real reach world final in Japan

ఇప్పటివరకు అన్ని లీగ్ టోర్నీల్లో కలిసి వరుసగా 36 మ్యాచ్‌ల్లోనూ రియల్ మాడ్రిడ్ అజేయంగా ముందుకు సాగుతున్నది. 'ఫస్టాఫ్‌లో మేం బాగా పుంజుకోలేకపోయాం. కానీ సెకండాఫ్‌లో మేం చాలా అవకాశాలు కల్పించుకున్నాం. క్రిస్టియానో రొనాల్డో గేమ్‌లో విజయం సాధించగలడం చాలా సంతోషంగా ఉంది. సుదీర్ఘ కాలం తర్వాత టోర్నీలో పాల్గొనేందుకు జపాన్‌కు వచ్చాం. ఫైనల్స్ మ్యాచ్‌ కోసం సిద్ధమయ్యేందుకు కొంత సమయం చిక్కింది. కానీ ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ టోర్నీలోనూ మేం విజయం సాధించాల్సి ఉన్నది' అని రియల్ మాడ్రిడ్ హెడ్ కోచ్ జిడానె అన్నాడు.

రియల్ మాడ్రిడ్ ప్లేయర్ బెంజెమా మాట్లాడుతూ కష్టమైన జట్టుతో ఆడేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. సుదీర్ఘ ప్రయాణం వల్ల కూడా పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయని, అయినా తాము బాగా ఆడి ఫైనల్స్‌కు చేరుకున్నట్లు తెలిపాడు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు రొనాల్డో ఎప్పటికప్పుడు ఖాళీ ప్రదేశాల మీదుగా బంతిని ముందుకు నడిపించాడు.

మరోవైపు టోనీ క్రూస్ పంపిన పాస్‌ను సద్వినియోగం చేసుకుని బెంజెమా ఫస్టాఫ్‌లోనే గోల్ సాధించాడు. ఇటీవలే నాలుగోసారి బాల్లోన్ డి 'ఓర్ అవార్డు గెలుచుకున్న రొనాల్డో ఇంజ్యూరీ సమయంలో బంతిని గోల్ పోస్ట్‌కు పంపడంతో రియల్ మాడ్రిడ్‌ను విజయం వరించింది. పోర్చుగీస్ సూపర్ స్టార్ పంపిన బంతిని ప్రత్యర్థి జట్టు గోల్ కీపర్ మౌసెస్ మునోజ్ రెండుసార్లు నిలువరించాడు.

దీంతో ఇంజ్యూరీ టైమ్ లో టైట్ యాంగిల్ ద్వారా పంపిన బంతి నేరుగా గోల్ పోస్ట్ లో చేరిపోయింది. అయితే తొలిసారి ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్న వీడియో టెక్నాలజీ ద్వారా పరీక్షించాక గోల్ కాదని నిర్ధారిస్తారని భావించడంతో కొంత గందరగోళం నెలకొంది. కానీ రిఫరీ ఎన్రిక్యు సాసెరెస్ తుదకు రొనాల్డో మంచి గోల్ చేశాడని సర్టిపికెట్ ఇవ్వడంతో కథ సుఖాంతమైంది.

'ఇది నూతన ప్రయోగం, కానీ నిజాయితీగా చెప్పాలంటే దాన్ని అంగీకరించం' అని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గ్రహీత లుక్కా మొడ్రిక్ పేర్కొన్నాడు. ఇది గందరగోళాన్ని పెంపొందించిందన్నాడు. ఈ వ్యవస్థను ఫిఫా కొనసాగిస్తుందని తాను భావించడం లేదన్నాడు అయితే టెక్నాలజీ వినియోగంపై విమర్శలు చేసేందుకు రియల్ మాడ్రిడ్ హెడ్ కోచ్ జినెడిన్ జిడానె నిరాకరించాడు. తన వ్యక్తిగత అభిప్రాయం వివాదాస్పదమవుతుందని చెప్పాడు.

ఫిఫా విధాన నిర్ణయంగా అమలుచేసినందున తాన్ని ఆహ్వానించాల్సిందేనని, దీనిపై తమకు నిర్ణయాధికారం లేదన్నాడు. అయితే విజయావకాశాలపై మరింత పారదర్శకతకు ఇది దోహద పడుతుండవచ్చునన్నాడు. కాగా, మెక్సికో క్లబ్ అమెరికా కోచ్ రిచర్డో లా వోల్పే స్పందిస్తూ మ్యాచ్ లో ఓటమి పాలవ్వడం దురద్రుష్టకరమని చెప్పాడు. తాము మ్యాచ్ పై ఆధిపత్యం సాధించినా అది సరిపోలేదన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+