
హైదరాబాద్: రొనాల్డో సైతం ఊహించలేదంట. తాను అంత గొప్ప ముగింపు ఇవ్వగలడని. అతను చేసిన గోల్ మ్యాచ్‌ను మార్చేయడమే కాదు. చరిత్రలో నిలిచిపోయేలా ఉందని విమర్శకులనుంచి సైతం ప్రశంసలు అందుతున్నాయి. మంగళవారం రియల్ మాడ్రిడ్‌కు జ్యూవెంటస్ జట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరిగింది. మ్యాచ్ మొదలై 39నిమిషాల గడుస్తున్న సమయంలో రొనాల్డొ చేసిన కిక్ అందరిలో ఉత్సాహాన్ని రేకెత్తించింది.
మొత్తం ఈ సీజన్‌లోనే టాప్ స్కోరర్ గా నిలిచిన రొనాల్డొ.. ఈ కిక్ గురించి తాను కూడా ఊహించలేదని చెప్తున్నాడు. గోల్‌కీపర్ గ్యాన్‌లుగీ బఫెన్‌కు దగ్గరలో ఉండగానే అటుగా వస్తున్న బాల్‌ను వెనక్కి పడిపోతూ.. ఒక్క సారిగా కాలితో తన్నాడు. అది కాస్త ఎవరూ ఊహించనంత వేగంతో నెట్‌లో పడింది. దోంతో రొనాల్డొ చేసిన బై సైకిల్ కిక్ చరిత్రలో గుర్తుండిపోతుందంటూ మ్యాచ్ చూసిన వాళ్లందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
సీజన్ మొత్తంలో సాధించిన ఫలితాలను మాంచెస్టర్ యునైటెడ్ జట్టు 2003 తర్వాత ఇప్పటివరకు చవిచూడలేదు. ఈ రకంగా మ్యాచ్ ముగించిన రొనాల్డొను వీడియో చూసిన వాళ్లెవరూ మెచ్చుకోక ఉండరు.
క్లిష్టతరమైన గోల్‌తో రియల్ మాడ్రిడ్‌ను గట్టెక్కించిన రొనాల్డో:
చాంపియన్స్ లీగ్ టైటిల్‌ను రెండుసార్లు గెలుచుకున్న రియల్ మాడ్రిడ్.. జువెంటస్ జట్టుపై 3-0 స్కోర్ తేడాతో గెలుపొందినందుకు లేబ్రోన్ జేమ్స్ తదితరులు రొనాల్డోను ప్రశంసల్లో ముంచెత్తారు. అలియాంజ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో గోల్ సాధించడం రియల్ మాడ్రిడ్ ఫ్యాన్స్ లేచి నిలబడి రొనాల్డోకు అనుకూలంగా కేరింతలు కొట్టారు. ఇది రొనాల్డోకు చిరస్మరణీయమైన జ్నాపకంగా మిగిలిపోతుందని పేర్కొన్నారు.