Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'నా కెరీర్‌లో చేసిన ఉత్తమ గోల్ కన్నా... ఆమెతో చేసిన సెక్స్ ఎంతో గొప్పది'

Ronaldo rates sex with girlfriend Georgina Rodriguez above his best goal

హైదరాబాద్: తన కెరీర్‌లో చేసిన ఉత్తమ గోల్‌ కన్నా తన ప్రేయసి, మోడల్‌ జార్జినా రోడ్రిగెజ్‌తో చేసిన శృంగారమే ఎంతో గొప్పదని పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అన్నాడు. తాజాగా రొనాల్డో ప్రముఖ ఇంగ్లీష్‌ జర్నలిస్టు పీయర్స్‌ మోర్గాన్‌కు ఇంటర్వ్యూలో రొనాల్డో ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఐటీవీ ఇంటర్వ్యూలో ఏప్రిల్‌ 2018లో రియల్‌ మాడ్రిడ్‌ తరఫున ఇటలీకి చెందిన జువెంటస్‌పై చేసిన ఓవర్‌ హెడ్‌ కిక్‌ గోల్‌ అత్యుత్తమా? అని పీయర్స్‌ మోర్గాన్‌ ప్రశ్నించిన సందర్భంలో రొనాల్డో మాట్లాడుతూ "కాదు, నా ప్రేయసితో పోల్చినప్పుడు అది అత్యుత్తమ గోల్‌ కాదు!' అని రొనాల్డొ నవ్వుతూ అన్నాడు.

ఓవర్‌హెడ్‌ గోల్‌ చేసేందుకు

ఓవర్‌హెడ్‌ గోల్‌ చేసేందుకు

2017-18 ఛాంపియన్స్ లీగ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో డానీ కార్వెంజల్ పాస్ చేసిన బంతిని రొనాల్డో గోల్‌గా మలిచాడు. "ఓవర్‌హెడ్‌ గోల్‌ చేసేందుకు చాలా ఏళ్లు ప్రయత్నించాను. మాములుగా 700 గోల్స్‌ చేసుంటాను. కానీ ఎప్పుడూ దానిని చేయలేదు. జువెంటస్‌పై ఎట్టకేలకు గోల్ చేశానని అనుకున్నాను. ఆ తర్వాత గియానలుగిపై చేసిన ఆ గోల్‌ అద్భుతమైనది" అని రొనాల్డొ అన్నాడు.

ఛాంపియన్స్ లీగ్ సెమీ పైనల్స్‌కు

ఛాంపియన్స్ లీగ్ సెమీ పైనల్స్‌కు

రొనాల్డో చేసిన ఈ గోల్‌తో జువెంటస్‌పై రియల్ మాడ్రిడ్ అద్భుత విజయాన్ని నమోద చేయడంతో పాటు ఛాంపియన్స్ లీగ్ సెమీ పైనల్స్‌కు అర్హత సాధించింది. సెమీస్‌లో బేయార్న్ మునిచ్ జట్టుపై గెలిచి ఫైనల్స్‌లో లివర్ పూల్ జట్టుతో తలపడింది. ఫైనల్స్‌లో లివర్ పూల్‌పై విజయం సాధించి మూడోసారి రియల్ మాడ్రిడ్ ఛాంపియన్స్ లీగ్ టైటిల్ విజేతగా నిలిచింది.

 రొనాల్డో మాట్లాడుతూ

రొనాల్డో మాట్లాడుతూ

రొనాల్డో మాట్లాడుతూ "ఆమె నాకు ఎంతో సాయం చేసింది. ఆమెతో నేను ప్రేమలో ఉన్నా. ఏదో ఒకరోజు ఆమెను వివాహం చేసుకుంటా. మా తల్లి యొక్క డ్రీమ్ కూడా అదే. కాబట్టి ఏదో ఒకరోజు ఆమెను ఎందుకు వివాహం చేసుకోకూడదు?" అంటూ పీయర్స్‌ మోర్గాన్‌ ప్రశ్నకు సమాధానమిచ్చాడు.

సంతోషంగా ఉంది

"చాలా సంతోషంగా ఉంది. ఆమె నా స్నేహితురాలు. మా ఇద్దరి మధ్య అనేక సంభాషణలు ఉన్నాయి. నేను ఆమె కోసం హృదయాన్ని తెరిచాను. ఆమె కూడా నా కోసం హృదయాన్ని తెరుస్తుంది" అని రొనాల్డో చెప్పుకొచ్చాడు. రియల్ మాడ్రిడ్ జట్టుకు ఆడుతున్న సమయంలో తొలిసారి రొనాల్డోని రోడ్రిగెజ్‌ కలిసింది.

నలుగురు పిల్లలతో కలిసి

ప్రస్తుతం రొనాల్డో.. రోడ్రిగెజ్‌ తమ నలుగురు పిల్లలతో కలిసి టురిన్‌లో నివసిస్తున్నారు. ఆదివారం ద సన్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో రోడ్రిగెజ్‌ మాట్లాడుతూ తొలిసారి రొనాల్డోను చూడగానే అతడితో ప్రేమలో పడినట్లు తెలిపింది. "మొదటిసారి రొనాల్డోను నేను గూచీ మీటింగ్‌లో కలిశాను, అక్కడ నేను సేల్స్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నా" అని రోడ్రిగెజ్‌ పేర్కొంది.

Story first published: Wednesday, September 18, 2019, 17:11 [IST]
Other articles published on Sep 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+