Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫోటోలు: 'ఆ అవార్డు పొందేందుకు అతడు అర్హుడే'

యొకొహమా: మరోసారి క్లబ్ వరల్డ్ కప్ టైటిల్‌ను గెలుచుకోవాలని తహతహలాడుతున్న క్రిస్టియానో రొనాల్డో బాల్లోన్ డి'ఓర్ అవార్డు పొందేందుకు అర్హుడేనని స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ జెయింట్స్ 'రియల్ మాడ్రిడ్' హెడ్ కోచ్ జినెడిన్ జిడానె వ్యాఖ్యానించాడు.

క్లబ్ వరల్డ్ కప్ టోర్నీ సెమీ ఫైనల్స్‌లో మెక్సికో క్లబ్ అమెరికా జట్టుతో రియల్ మాడ్రిడ్ తలపడనున్న నేపథ్యంలో జిడానె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మూడు రోజుల క్రితమే నాలుగోసారి ప్రపంచంలోకెల్లా ఉత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా బాల్లోన్ డి' ఓర్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

'మరిన్ని అవార్డులే లక్ష్యం, ఆ రికార్డు సమం చేస్తా'

క్రిస్టియానో భారీస్థాయిలో ఎల్లవేళలా ప్రేరణ పొందిన ఆటగాడు అని మీడియాతో అన్నాడు. ఆటలో ఫ్రెండ్లీగా ఉంటాడని చెప్పాడు. రియల్ మాడ్రిడ్ క్లబ్ జట్టులో చాలా మంది గొప్ప ప్లేయర్లు ఉన్నా క్రిస్టియానో రొనాల్డో మాత్రం పలు అవార్డులు గెలుచుకున్న అరుదైన ప్లేయర్ అని ప్రశంసించాడు.

నాలుగోసారి బాల్లోన్ డి'ఓర్ అవార్డు గెలుచుకోవడం ఆశామాషీ విషయం కాదని, ఖచ్చితమైన అపురూపమైందన్నాడు. ఐదో సారి అవార్డు గెలుచుకునేందుకు కూడా అర్హుడేనన్నాడు. లియానెల్ మెస్సీ సాధించిన ఐదో అవార్డుకు ఒక అడుగు దూరంలో ఉన్నాడన్నాన్నాడు.

35 మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన రియల్ మాడ్రిడ్

35 మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన రియల్ మాడ్రిడ్

ఇప్పటివరకు 35 మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన రియల్ మాడ్రిడ్ జట్టు.. ఐదో వరల్డ్ ఫుట్ బాల్ టైటిల్ గెలుచుకునేందుకు సిద్ధంగా ఉంది. అయితే గురువారం జరిగే మ్యాచ్‌లో సారథి సెర్జియో రామోస్ ఆడకపోవచ్చునన్నాడు. తీవ్రమైన గాయం కాకపోయినా సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఒకింత అలసిపోయినట్లు కనిపిస్తున్నాడన్నాడు. అయితే ఫైనల్స్ మ్యాచ్ లో ఆడేందుకు సిద్ధంగా ఉంటాడని జిడానె అన్నాడు. చీల మండల గాయంతో గారెథ్ బాలెను మిస్ కావడం ఇబ్బందికరమేనన్నాడు.

మన జట్టుకు తలనొప్పి

మన జట్టుకు తలనొప్పి

కుర్రాళ్లు క్లబ్ అమెరికా జట్టుపై గెలవగలమని అతి విశ్వాసంతో వ్యవహరించొద్దని సుతిమెత్తగా మందలించాడు. రియల్ మాడ్రిడ్‍పై జరిగే మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొందాలని ఆ జట్టు సభ్యులు గట్టిగా ప్రయత్నిస్తారన్నాడు. రియల్ మాడ్రిడ్ ప్లేయర్లు విజయం తప్ప మరో అంశంపై ఫోకస్ పెట్టొద్దని కోరాడు.‘క్లబ్ అమెరికా కుర్రాళ్లు పూర్తిగా నైపుణ్యం కలిగి ఉంటూ తెలివైన ఆటగాళ్లుగా రుజువు చేసుకుంటారు' అని అన్నాడు. ‘వారు మన జట్టుకు తప్పనిసరిగా తలనొప్పిగా పరిణమిస్తారు' అని చెప్పాడు.‘క్లబ్ అమెరికా జట్టుతో జరిగే మ్యాచ్ చాలా క్లిష్టంగా ఉంటుంది' అని వివరించాడు.

ఎవర్టోన్‌తో ఓటమిని ఆత్మశోధన చేసుకోవాలన్న అర్సెనల్ వింగర్

ఎవర్టోన్‌తో ఓటమిని ఆత్మశోధన చేసుకోవాలన్న అర్సెనల్ వింగర్

ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్) లీగ్ మ్యాచ్‌లో ‘ఎవర్టోన్' జట్టు చేతిలో 1-2 స్కోర్ తేడాతో ఓటమి పాలవ్వడంపై అర్సెనల్ జట్టు ఆత్మశోధన చేసుకోవాలని జట్టు మేనేజర్ అర్సెన్ వింగ్ వ్యాఖ్యానించాడు. మంగళవారం ఎవర్టోన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అర్సెనల్ ఓటమి పాలవ్వడంతో 15 మ్యాచ్‌ల్లో జట్టు అజేయమైన రికార్డును నిలువరించగలిగింది.

టాప్‌లో చెల్సియా

టాప్‌లో చెల్సియా

మాజీ ఇపిఎల్ చాంపియన్లుగా 16 మ్యాచ్ ల్లో కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమి పాలవ్వడంతోపాటు 34 పాయింట్లతో ప్రస్తుతం ఇపిఎల్ టోర్నీలో లీడర్లుగా కొనసాగుతున్న చెల్సియా కంటే ఒక స్థానం వెనుకబడి ఉంది. తమ గురించి తాము ఆలోచించుకోవాల్సిన దుస్థితి నెలకొన్నదని చెప్పాడు. కంఫర్టబుల్ చాన్స్ కోసం ఎదురుచూసేలోగా భౌతికంగా బలమైన జట్టుగా ఎవర్టోన్ విజయం సాదించగలిగిందన్నాడు. మొత్తంగా తాము కొన్ని అవకాశాలు మాత్రమే నెలకొల్పడం వల్ల కూడా ముందుకు వెళ్లలేకపోయామన్నాడు. ఫుట్ బాల్ మ్యాచ్‌లలో వాతావరణాన్ని బట్టి మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుందని తెిపాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+