ఆశ చూపారు: చైనా క్లబ్ భారీ ఆఫర్‌కూ రొనాల్డో నో
మాడ్రిడ్: చైనీస్ సూపర్ లీగ్ (సిఎస్ఎల్) క్లబ్ భారీ మొత్తంలో వేతనం ఆఫర్ ఇచ్చినా తోసిరాజని తానేమిటో రుజువుచేసుకున్నాడు స్పానిష్ ఫుట్ బాల్ లీగ్ లా లీగ జెయింట్స్ రియల్ మాడ్రిడ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో. వార్షిక వేతనంగా 104.6 మిలియన్ డాలర్ల వేతనం ఇస్తామని ఆశ చూపినా రియల్ మాడ్రిడ్ జట్టును వదలబోనని ఈ పోర్చుగల్ టీం సారధి నిర్ణయించుకున్నాడని క్రిస్టియానో రొనాల్డో ఏజెంట్ జార్జ్ మెండెస్ ధ్రువీకరించాడు.
ప్రస్తుతం రొనాల్డోకు రియల్ మాడ్రిడ్ చెల్లిస్తున్న వేతనం కంటే చైనీస్ క్లబ్ చేసిన ప్రతిపాదన ఐదు రెట్లకు పై మాటే. నాలుగోసారి బాల్లోన్ డి'ఓర్ అవార్డు గెలుచుకున్న ఈ క్రిస్టియానోను తమ జట్టులో చేర్చుకునేందుకు ఓ క్లబ్ యాజమాన్యం 264 మిలియన్ డాలర్లు రియల్ మాడ్రిడ్ యాజమాన్యానికి చెల్లించేందుకు కూడా సిద్ధమని మెండిస్ ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

చైనీస్ క్లబ్ భారీ ఆఫర్
క్రిస్టియానో రొనాల్డోకు ఈ స్థాయిలో చైనీస్ క్లబ్ భారీ ఆఫర్ చూపడం ఇదే మొదటి సారి కూడా కాదని మెండిస్ అన్నాడు. క్రిస్టియానో రొనాల్డోను అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదని తేల్చి చెప్పాడు. కానీ డబ్బుతోనే ప్రతి ఒక్కటి సాధించలేమన్నాడు. రొనాల్డో జీవితంలో రియల్ మాడ్రిడ్ ఒక భాగమని చెప్పాడు.

రియల్ మాడ్రిడ్ జట్టులో
రియల్ మాడ్రిడ్ జట్టులో కొనసాగడం పట్ల తమ యజమాని హ్యాపీగా ఉన్నాడని, స్పెయిన్ క్లబ్ తరఫునే ఫుట్‌బాల్‌కు ప్రాతినిధ్యం వహించాలన్నది ఆయన విదానమన్నాడు. అర్జెంటీనా స్ట్రయికర్ కార్లోస్ తెవెజ్‌తో షాంఘై షెన్హువా ఒప్పందం చేసుకున్న తర్వాత రొనాల్డో ఏజెంట్ ఈ విషయం బయటపెట్టడం గమనార్హం.

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వేతనం
వారానికి 7.57 లక్షల డాలర్ల వేతనం, ఏడాది పొడవునా వేతనం 35 మిలియన్ డాలర్ల వేతనం పొందుతూ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వేతనం పొందుతున్న ఫుట్ బాల్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. స్పానిష్ పుట్ బాల్ లీగ్ ప్లేయర్లు గారెథ్ బాలె, రొనాల్డో, గొంజాలో హిగౌన్, నేయ్మార్, పాల్ పోగ్బాలను కొనుగోలు చేయాలంటే భారీ మొత్తంలో ట్రాన్స్‌ఫర్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

చైనా సూపర్ లీగ్‌లో హై ప్రొఫైల్ ప్లేయర్లు
ఇటీవల బ్రెజిలియన్ మిడ్ ఫీల్డర్ ఆస్కార్.. చెల్సియా టీం నుంచి షాంఘై ఎస్ఐపిజి టీంలో చేరేందుకు 74.7 మిలియన్ల డాలర్ల వేతనం పొందాడు. ఇటీవలి కాలంలో చైనా సూపర్ లీగ్ (సిఎస్ఎల్) చేరుతున్నహై ప్రొఫైల్ ప్లేయర్లు పెరిగారు. గ్యాంగ్ జౌ ఎవర్ గ్రాండెలో పాలిన్హో, బీజింగ్ గోవాన్ జట్టులో రెనాటో అగస్టో, షాంఘై షెన్హువాలో దెంబా బా, హెబై చైనా ఫార్చ్యూన్ జట్టులో ఎజెక్వెల్ లావెజ్జి ఇటీవల చేరిన ప్రముఖులు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications