For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రియల్‌ మాడ్రిడ్‌ వెంటే రొనాల్డో: టోనీ కూడా ఒప్పందం

By Nageshwara Rao

మాడ్రిడ్‌: రియల్‌ మాడ్రిడ్‌ కీలక ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డో ఎప్పటికైనా జట్టుతోనే కల కంటున్నట్లు తెలిపాడు. ఫ్రాన్స్‌లో యూరోపియన్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీని గత మేలో మూడోసారి గెలుచుకున్న రొనాల్డో.. రియల్‌ మాడ్రిడ్‌ తరపునే చాంపియన్స్‌, యూరో టోర్నీల్లో విజయం సాధించానని, ఇది తన జీవితంలో అద్భుతమైన సన్నివేశమన్నాడు. రియల్‌ మాడ్రిడ్‌ క్లబ్‌కు తన హృదయంలో ప్రత్యేక స్థానముందన్నాడు.

మాడ్రిడ్‌తో టోనీ కాంట్రాక్ట్‌

'రియల్‌ మాడ్రిడ్‌' క్లబ్‌తో జర్మనీ మిడ్‌ ఫీల్డర్‌ టోనీ క్రోస్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2022 జూన్‌ వరకు తమతోనే కొనసాగుతాడని రియల్‌ మాడ్రిడ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 2015 - 16 చాంపియన్స్‌ లీగ్‌లో లాస్‌బ్లాంకో, 2014 ఫిఫా క్లబ్‌ వరల్డ్‌కప్‌, 2014 & 2016 సూపర్‌కోపా డీ ఇస్పానా లీగ్‌ టోర్నీల్లో విజయానికి టోనీ సహకరించాడు.

అండ్రెస్‌ ఇనిస్టాతో బార్సిలోనా లైఫ్‌టైమ్‌

స్పానిష్‌ స్టార్‌ మిడ్‌ఫీల్డర్‌ అండ్రెస్‌ ఇనిస్టాతో బార్సిలోనా క్లబ్‌ లైఫ్‌టైం ఒప్పందం కుదుర్చుకొనేందుకు సిద్ధమవుతోంది. 2018 జూన్‌లో ముగియనున్న కాంట్రాక్ట్‌ను కొనసాగించేందుకు బార్సిలోనా క్లబ్‌ ఫ్రాంచైసీ యాజమాన్యం.. భారీ ఆఫర్‌ను ఆయన ముందు ప్రతిపాదించినట్లు సమాచారం. 20 ఏళ్లుగా ఇదే క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్పానియార్డ్‌ ప్లేయర్‌.. తన కాంట్రాక్ట్‌ రెన్యూవల్‌ విషయమై క్లబ్‌ డైరెక్టర్లతో భేటీ కోసం వేచిచూస్తున్నానని పేర్కొనడం గమనార్హం.

Ronaldo: It's my dream to stay at Madrid for many years

రేపు డెపోర్టివోతో బార్సిలోనా.. బెటిస్‌తో మాడ్రిడ్‌

స్పానిష్‌ లీగ్‌ 'లా లీగా' టోర్నీలో శనివారం డెపోర్టివో క్లబ్‌తో బార్సిలోనా, రియల్‌బెటిస్‌తో రియల్‌ మాడ్రిడ్‌ తలపడనున్నాయి. కొన్ని వారాలుగా గాయంతో బాధపడుతూ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న బార్సిలోనా క్లబ్‌ ప్రధాన ఆటగాడు లియానల్‌ మెస్సీ రెండు రోజులుగా జట్టుతో కలిసి ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నాడు.

రొనాల్డ్‌ కంటే మెస్సీ బెటర్‌: మారడోనా

రియల్‌ మాడ్రిడ్‌లో కీలక ప్లేయర్‌ క్రిష్టియానో రొనాల్డో కంటే బార్సిలోనా ఆటగాడు లియానల్‌ మెస్సీ ఎంతో మెరుగని ఫుట్‌బాల్‌ ఐకాన్‌ డియాగో మారడోనా వ్యాఖ్యానించాడు. భవిష్యత్‌లో తన పాత్రను పోషిస్తాడన్నాడు. జట్టులో సీనియర్‌ ప్లేయర్‌గా ఎనిమిది సార్లు లా లీగా లీగ్‌ చాంపియన్‌షిప్‌, నాలుగుసార్లు చాంపియన్స్‌ లీగ్‌ టైటిల్‌ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. రియల్‌ మాడ్రిడ్‌ జట్టు రొనాల్డో నాలుగు సార్లు చాంపియన్స్‌ లీగ్‌ టైటిల్‌ గెలుచుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆటలో ఇద్దరూ సమ ఉజ్జీలైనా మెస్సీ బెటరనీ మారడోనా పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+