మియామి: పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరో కొత్త ప్రేమాయణం మొదలు పెట్టాడు. ఇతను ఈ మధ్యనే సూపర్ మోడల్ ఇరీనా షిక్కు గుడ్ బై చెప్పాడు. అనంతరం తాజాగా, మరో గాళ్‌ఫ్రెండ్‌ను చూసుకోవడం గమనార్హం.
ప్రస్తుతం అతడు ఇటాలియన్ మోడల్, నటి అలెస్సియా టెడెస్సీతో డేటింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బికినీ మోడల్‌గా ఆమెకు పేరు ఉంది. చాంపియన్స్ లీగ్‌లో రొనాల్డో ఆట చూసేందుకు ఇటలీ నుంచి స్పెయిన్ వెళ్లింది.
చాంపియన్స్ లీగ్‌లో రొనాల్డో రియల్ మాడ్రిడ్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో అతడు 61 గోల్స్‌తో అదరగొట్టాడు. మియామిలోని ఓ బీచ్‌లో ఇటీవలే జరిగిన బికినీ ఫొటోషూట్‌లో సందర్భంగా అలెసియా అందాన్ని చూసిన రొనాల్డో ముగ్ధుడయ్యాడట.
తొలిచూపులోనే ఆమె మనసు దోచేయడంతో ఆ తర్వాత మాట కలిపాడు. అనంతరం ఇద్దరు ఒక్కడై ఇప్పుడు డేటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది.