Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వాళ్లతో మళ్లీ ఆడాలనుంది: రొనాల్డో

Ronaldo hoping to play with Benzema and Bale again

హైదరాబాద్: ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు "బాల్లోన్ డీ ఆర్'. ఈ అవార్డున అయిదు సార్లు అందుకున్న క్రిస్టియన్ రొనాల్డో తనకు మళ్లీ ఇద్దరు ఆటగాళ్లతో ఆడాలని ఉందని కోరకను బయటపెట్టాడు. వారెవరంటే కరీమ్ బెంజెమా, గరేత్ బాలె. అంతేగాక, రియల్ మద్రీద్‌కు చెందిన బీబీసీ జట్టు అంతా మళ్లీ కలవడం చాలా గొప్ప విషయం అన్నాడు.

అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన అల్ జజిరా జట్టుకు వ్యతిరేకంగా ఆడుతున్న సెమీఫైనల్‌ను ఉద్దేశించి రొనాల్డో.. బుధవారం జరగనున్న ఈ మ్యాచ్‌లో బెంజెమా, బాలెలు కలిసి ఆడడంతో జట్టుకు మరింత బలం చేకూరుతుందన్నాడు. ఇంతకుముందు వీళ్ల ముగ్గురు కలిసి ఆడిన మ్యాచ్‌లో బెంజెమా, బాలెలు గాయపడ్డారు. వాళ్లు తిరిగి మళ్లీ అదే స్థాయిలో ఆడాలని ఆశపడుతున్నానని అన్నాడు.

'నేను టీం పూర్తి అయిందనుకుంటున్నాను. అదీ కేవలం బెంజెమా, బాలెలతో కాదు. అందరి సహకారంతోనే విజయాన్ని పొందగలమని నా అభిప్రాయం' అంటూ మీడియాతో మాట్లాడుతూ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ఇంకా, ఇది చాలా శుభప్రదమైన విషయం. అందరూ మంచి ఫిటెనెస్‌ను కలిగి ఉన్నారని పేర్కొన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 13, 2017, 12:01 [IST]
Other articles published on Dec 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+