రొనాల్డో ఆడే మ్యాచ్ లు టీవీలో వస్తున్నప్పుడు భారత నగరాల్లో వీదులు నిర్మానుష్యం కానున్నాయి. ఫుట్ బాల్ ప్రపంచ టాప్ హీరో రోనాల్డోకు భారత్ లోనూ మంచి ఆదరణ ఉంది. ప్రపంచ కప్ ఫుట్ బాల్ కి ఇంకా మూడు రోజులే ఉండడంతో ముంబైలో రొనాల్డో గురించి పెద్ద చర్చే జరుగుతుంది. తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏకంగా బాలీవుడ్ దాకా పాకింది. హీరోయిన్లు రొనాల్డో పేరు చెపితేనే ఊగిపోతున్నారు. అసలు ఫుట్‌బాల్ అంటేనే రొనాల్డో అనేదాకా వెళుతున్నారు.
అతడు లేకపోతే ప్రపంచ కప్ వృధానే అని తీర్మానిస్తున్నారు. అమృతా రావు, ముగ్దా గాడ్సే, మెక్సికన్ నటి, కైట్స్ ఫేమ్ బార్బరా మోరి రొనాల్డో అభిమానుల జాబితాలో ఉన్నారు. గతంలో బిపాషా బసు ఏకంగా రొనాల్డోకు ముద్దిచ్చి తోటి హీరోయిన్లకు అసూయను కలిగించింది. దక్షిణాది కథానాయిక శ్రియ మాత్రం అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీపై తమ అభిమానాన్ని చాటుకుంది.