Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విజయంతో ముగించాం: ఛాంపియన్స్ లీగ్‌ టైటిల్‌పై కన్నేసిన రొనాల్డో

Ronaldo eyes Champions League three-peat with Real Madrid

హైదరాబాద్: రియల్ మాడ్రిడ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. బుధవారం బోరుస్సియా డోర్ట్‌ముంద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రియల్ మాడ్రిడ్ జట్టు 3-2తేడాతో విజయం సాధించడంతో ఛాంపియన్స్ లీగ్‌లో రొనాల్డో టాప్ గోల్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.

తద్వారా ఛాంపియన్ లీగ్ గ్రూప్ స్టేజి మ్యాచ్‌ల్లో గత ఆరు సార్లుగా ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. ప్రస్తుతం రియల్ మాడ్రిడ్ జట్టు గ్రూప్-హెచ్‌లో 13 పాయింట్లతో రెండో స్దానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు మాడ్రిడ్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో నాలుగింటిలో విజయం సాధించగా... ఒకదానిలో ఓటమి, మరొక మ్యాచ్‌ని డ్రాగా ముగించింది.

ఈ సందర్భంగా రొనాల్డ్ మాట్లాడుతూ 'ఈసారి ఛాంపియన్స్ లీగ్‌ను గెలుస్తాం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే గ్రూప్ స్టేజిని అధిగమించాం. ఇప్పుడు మా ముందున్న ఏకైక లక్ష్యం ఛాంపియన్సీ లీగ్‌ను గెలుపొందడమే' అని పేర్కొన్నాడు.

'నాకు చాలా సంతోషంగా ఉంది. విజయంతో గ్రూప్ స్టేజిని ముగించాం. నేను కూడా గోల్స్ సాధించా. ఓ అద్భుతమైన గోల్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించా. ఇక్కడ రికార్డు కూడా ఎంతో ముఖ్యం. చాలా ఆనందంగా ఉంది' అని రొనాల్డో తెలిపాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 7, 2017, 15:36 [IST]
Other articles published on Dec 7, 2017
Read in English: Ronaldo eyes CL title
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+