For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒకేసారి ఇద్దరినీ పెళ్లాడబోతున్న 38 ఏళ్ల ప్లేయర్

Ronaldinho to marry two women at the same time

హైదరాబాద్: సహజంగానే పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి వేరే వాళ్లతో చనువుగా ఉంటేనే ఊరుకోరు అమ్మాయిలు. అలాంటిది తన ఇద్దరు ప్రియురా ళ్లను.. ఒకేసారి పెళ్లి చేసుకోబోతున్నాడు బ్రెజిల్‌ మాజీ స్టార్‌ ఫుట్‌బాలర్‌ రొనాల్డినో. 38 ఏళ్ల రొనాల్డినో.. మనసిచ్చిన ప్రిసి ల్లా కోయెలో, బీట్రిట్‌ సౌజాలను పరిణయమాడనున్నాడు. ఈ వేడుక ఆగస్టులో జరగనుంది.

ఈ బ్రెజిల్‌ దిగ్గజ ప్లేయర్‌ చాలా ఏళ్ల నుంచి ప్రిసిల్లాను ప్రేమిస్తున్నాడు. ఆమెతో సంబంధాన్ని కొనసాగిస్తూనే 2016 నుంచి సౌజాతో డేటింగ్‌ చేస్తున్నాడు. ఈ ముగ్గురూ గత డిసెంబర్‌ నుంచి రియో డిజనీరో మాన్షన్‌లో కలిసి ఉంటున్నట్టు సమాచారం. రియోలోనే జరిగే ప్రైవేటు వేడుకలో రొనాల్డినో ఈ ఇద్దరిని పెళ్లి చేసుకోబోతున్నాడని బ్రెజిల్‌కు చెందిన ఓ దినపత్రిక తెలిపింది.

జనవరిలోనే పెళ్లికి ఒప్పించిన రొనాల్డినో.. వారికి ఎంగేజ్‌మెంట్‌ ఉంగరాలు కూడా తొడిగాడట. అంతేకాదు చేతి ఖర్చులకు గాను వీరికి చెరో 1500 పౌండ్లు (సుమారు రూ. 1.37 లక్షలు) ఇస్తున్నాడట. అలాగే, ఇద్దరికీ ఒకే రకమైన బహుమతులు కొంటున్నాడట. రొనాల్డినోను ఒకేసారి పెళ్లి చేసుకునేందుకు ఇద్దరూ ఒప్పుకోవడం విశేషం. అయితే రోనాల్డిన్హో పద్ధతులు నచ్చని అతని సోదరి, తాను మాత్రం ఆ వివాహానికి హాజరుకాబోనని ప్రకటించారు.

బ్రెజిల్‌ జాతీయ జట్టు తరపున 97 మ్యాచ్‌లు ఆడిన రొనాల్డినో.. 37 గోల్స్‌ చేశాడు. రెండుసార్లు ఫిఫా వరల్డ్‌కప్‌నకు ప్రాతినిథ్యం వహించాడు. 2002 వరల్డ్‌కప్‌ నెగ్గిన బ్రెజిల్‌ జట్టులో రొనాల్డినో సభ్యుడు. కాగా, లేట్‌నైట్‌ పార్టీలు, అమ్మాయిలతో డేటింగ్‌ వ్యవహారాలు అతని కెరీర్‌ దిగజారడానికి కారణాలయ్యాయి. బార్సిలోనా తరపున 2003 నుంచి 2008 వరకు ఆడాడు. గతేడాది భారత్‌లో నిర్వహించిన ప్రీమియర్‌ ఫుట్‌ సాల్‌ లీగ్‌లో ఢిల్లీ డ్రాగన్స్‌ తరపున రోనాల్డిన్హో ఆడాడు. ఈ ఏడాది జనవరిలో సోదరుడి ద్వారా రోనాల్డిన్హో రిటైర్‌మెంట్‌ ప్రకటన చేయించాడు.

Story first published: Friday, May 25, 2018, 10:07 [IST]
Other articles published on May 25, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+