
ఐపీఎల్ తరహాలో
"మౌలిక సదుపాయాలు బాగా పెరిగాయి. ఐఎస్ఎల్ యువ ఆటగాళ్లకు మంచి వేదికగా నిలిచింది. తమ ప్రతిభను నిరూపించుకొనేందుకు ఐపీఎల్ తరహాలో ఫుట్‌బాలర్లకు అది ఉపయోగపడుతోంది. ఈ విషయంలో అభిమానులతో సహా పుట్‌బాల్‌తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ క్రెడిట్ ఇవ్వాలి" అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

లాలిగాతో సంబంధం
"లాలిగాతో సంబంధం కలిగి ఉండటం చాలా ఆనందంగా ఉంది. స్పానిష్ పుట్‌బాల్ లీగ్ భారత్ ఫుట్‌బాల్ వ్యవస్థలోకి ప్రవేశించడం చూస్తుంటే ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. వ్యక్తిగతంగా, లాలిగాతో నాకు ఇది ఒక ఆసక్తికరమైన ప్రయాణంగా నేను భావిస్తున్నాను. లా లిగా బ్రాండ్ అంబాసిడర్ అని ఇవన్నీ చెప్పడం లేదు" అని రోహిత్ అన్నాడు.

జిదానె ఆట నాకెంతో ఇష్టం
"జిదానె ఆట నాకెంతో ఇష్టం. మైదానంలో అతడిని ఆటను చూస్తాను. అలా క్రమం తప్పకుండా ఫుట్‌బాల్ చూడటం అలవాటైంది. ప్రతిభ, నైపుణ్యం, అద్భుతంగా ఆడే స్పెయిన్ నాకిష్టమైన జట్టు. అభిరుచి, ప్రతిభ ఉన్న రియల్ మాడ్రిక్ క్లబ్ నాకిష్టం. ఈ లీగ్ భారత్‌లోని ఫుట్‌బాల్ అభిమానులకు తప్పక కనెక్ట్ అవుతుంది" అని రోహిత్ తెలిపాడు.

పుట్‌బాలర్ల హెయిర్ స్టైల్‌ను అనుకరిస్తారు
ఇక, భారత జట్టులోని శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా లాంటి యువ ఆటగాళ్లు ఫుట్‌బాల్ మ్యాచ్‌లను చూడటంతో పాటు ఆటగాళ్ల హెయిర్ స్టైల్‌ను అనుకరిస్తారని రోహిత్ శర్మ తెలిపాడు. టీమిండియాలో అత్యుత్తమ ఫుట్‌బాలర్ ఎవరని అడిగిన ప్రశ్నకు గాను ధోనీ అద్భుతమైన పుట్‌బాలర్ అంటూ సమాధానమిచ్చాడు.