రేప్ కేసులో సాకర్ ప్లేయర్ రాబిన్హోకు తొమ్మిదేళ్ల జైలు

హైదరాబాద్: బ్రెజిల్ మాజీ ఫార్వర్డ్ ఫుట్‌బాల్ ప్లేయర్ రాబిన్హో డిసౌజాకు రేప్ కేసులో తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది ఇటలీ కోర్టు. 2013 జనవరిలో మిలన్ క్లబ్ (ఇటలీ)కి ఆడుతున్న సమయంలో 22 ఏళ్ల అమ్మాయిపై మరో ఐదుగురితో కలిసి రేప్ చేసినట్లు విచారణలో రాబిన్హో ఒప్పుకోవడంతో కోర్టు ఈ శిక్ష విధించింది.
రాబిన్హో, అతని స్నేహితులు ఒక అమ్మాయితో ఎక్కువగా మద్యం తాగించి ఆపై అఘాయిత్యానికి పాల్పడినట్లు మిలన్ డైలీ ఓ కథనంలో పేర్కొంది. బాధితురాలికి పరిహారం కింద 60,000 యూరోలు ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించింది. 33 ఏళ్ల రాబిన్హో బ్రెజిల్‌లోని అట్లెటికో మినిర్వో జట్టుకు ఆడుతున్నాడు.
రాబిన్హో జైలు పాలు కావడం ఇదే తొలిసారి కాదు. 2009లో బార్‌లో ఒక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించి అతనిని గతంలో అరెస్ట్ చేశారు. బ్రెజిల్ తరఫున 100 మ్యాచ్‌లు ఆడిన ఈ స్ట్రైకర్ 28 గోల్స్ కొట్టాడు. రియల్ మాడ్రిడ్‌కు కూడా అతను ప్రాతినిధ్యం వహించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications