రియో కార్నివాల్‌కు 68 లక్షల లీటర్ల బీరు, నెయ్‌మర్ గర్ల్ ఫ్రెండ్ బ్రునా హాట్ అప్పియరెన్స్

Posted By: Subhan
Rio Carnival 2018: Neymar's girlfriend Bruna Marquezine sizzles in barely-there costume

హైదరాబాద్: రియో కార్నివాల్ 2018 ఇప్పటికీ మొదలైంది. బ్రెజిల్‌లో జరుగుతున్న రియో కార్నివాల్ ఉత్సవాలకు నెయ్‌మర్ తన గర్ల్ ఫ్రెండ్‌తో సహా హాజరయ్యాడు. వచ్చే వారం యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్‌లో రియల్ మాడ్రిడ్ జట్టుతో తలపడనున్న నెయ్‌మర్ పారిస్, ఫ్రాన్స్ దేశాల్లో విశ్రాంతి నిమిత్తం పర్యటిస్తున్నాడు. ఇందులో భాగంగానే బ్రెజిల్ ‌లోని రియో కార్నివాల్‌కు హాజరయ్యాడు.

ఆ ఉత్సవాల్లో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చేందుకు వచ్చిన బ్రునా అందరి మనసులను కొల్లగొట్టింది. ఈ నృత్యాలు ఆనవాయితీ 17వ శతాబ్ధం నుంచి కొనసాగుతున్నాయి. ఈ పోటీల్లో ఆరు మిలియన్ల వరకు బ్రెజిల్ క్రీడాకారులు పాల్గొనున్నారు. ఇక్కడ జరిగే పార్టీల ద్వారానే 3.5 బిలియన్ రియల్స్ వరకు రెవెన్యూ వస్తుంది. వీరి కోసం 1.8 మిలియన్ గ్యాలెన్ల (68 లక్షల లీటర్లు)బీరు, 106 మిలియన్ల కండోమ్‌లను అందుబాటులో ఉంచారు.

పాతికేళ్ల బ్యూటీ బ్రెజిలియన్ నటి, మోడల్ బ్రునాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 26 మిలియన్ ఫాలోవర్లున్నారు. 2013 నుంచి నెయ్‌మర్‌తో డేటింగ్ చేస్తున్న ఈ అమ్మడు రియో కార్నివాల్ వేదికకు హాజరైన దుస్తులు ఇప్పుడు హాట్ హాట్‌గా మారాయ్. నెయ్‌మర్ పారిస్ జట్టుతో 2017లో రికార్డు స్థాయిలో 1752 కోట్లకు పైగా ఒప్పందం కుదుర్చుకున్నాడు.
యూఈఎఫ్ఏ ఛాంపియన్ లీగ్‌లో రియల్ మాడ్రిడ్ జట్టుతో తలపడేందుకు సిద్ధమవుతున్నాడు.

ప్రారంభోత్సవ వేడుకలకు హాజరై అక్కడి సాంప్రదాయ ఆభరణాలతో మెరిసిపోయింది. ఇప్పటికే టీవీ షోలు, బ్రెజిలియన్ టెలినొవల్స్ ములెరస్, అపాక్సినాడస్, అండ్ అమెరికా, బ్రేకింగ్ త్రూ వంటి కార్యక్రమాల ద్వారా టీవీ ఛానల్స్ లో ఫామస్ అయింది. పారిస్ నగరానికైతే ఆమె ఓ సెలబ్రిటీ.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, February 12, 2018, 14:58 [IST]
Other articles published on Feb 12, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి