Revealed: లియోనల్ మెస్సి వివాహ మెనూ ఇదే (ఫోటోలు)
హైదరాబాద్: లియోనల్ మెస్సి... పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ పుట్‌బాల్ దిగ్గజం తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రేయసి ఆంటోనెల్లా రొకుజోని శుక్రవారం వివాహం చేసుకోనున్నాడు. మెస్సి పెళ్లికి నార్త్ అర్జెంటీనాలోని రొసారియా నగరం సిద్ధమైంది.
వీరిద్దరూ గత పదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఈ పెళ్లి గురించి ఆ దేశ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఈ పెళ్లి వేడుకను అర్జెంటీనాలో ఈ దశాబ్దంలోనే అత్యంత ఆడంబరమైన పెళ్లిగా చెప్పుకుంటున్నారు. తన పెళ్లి కోసం లియోనల్ మెస్సి కూడా భారీగా ఖర్చు చేస్తున్నాడు.

వివాహ విందులో ఏర్పాటు చేసిన మెనూ ఇదే
పాప్ స్టార్ షకీరా, మెస్సితో కలిసి ఆడిన ఆటగాళ్లు, మారడోనా సహా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఈ క్రమంలో మెస్సి వివాహ విందులో ఏర్పాటు చేసిన మెనూ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా 600మందికి పైగా ముఖ్య అతిథులు వస్తున్నారు. దీంతో ఈ పెళ్లిలో మెస్సి ప్రత్యేక మెనూ సిద్ధం చేశాడు.
అర్జెంటీనాలోని ప్రముఖ వంటకాలన్ని
మాంసాహారంతో నిండిపోయిన ఈ మెనూలో ప్రధానంగా అర్జెంటీనాలోని ప్రముఖ వంటకాలన్ని ఇందులో ఉన్నాయి. చికెన్, మటన్, ఫిష్ తదితరాలతో చేసిన భిన్న వంటకాలు భోజన ప్రియుల్ని ఆకట్టుకోనున్నాయి. అయితే తమ పెళ్లికి తీసుకొచ్చే బహుమతులను మెస్సి... లియో మెస్సి ఫౌండేషన్‌కు అందజేయాలని సూచించారు.
సిటీ సెంటర్ పుల్‌మ్యాన్ హోటల్‌లో
రొసారియో కాంప్లెక్స్‌లో ఉన్న సిటీ సెంటర్ పుల్‌మ్యాన్ హోటల్‌లో ఈ పెళ్లి జరుగుతుంది. ఈ పెళ్లి వేడుకకు వచ్చిన అథితులో కోసం ప్రత్యేకంగా కాసినోను సైతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మెస్సి బార్సిలోనా ఎఫ్‌సీకి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. మెస్సి పెళ్లి వేడుకను కవర్ చేసేందుకు 155 జర్నలిస్ట్‌లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.
పెళ్లి కుమార్తె డ్రస్సు ఎంతో ప్రత్యేకం
స్పానిష్ డిజైనర్ రోసా క్లారా డిజైన్ చేసిన పెళ్లి కుమార్తె డ్రస్సుని 29 ఏళ్ల ఆంటోనెల్లా రొకుజో పెళ్లిలో ధరించనుంది. హాలీవుడ్ స్టార్లు ఇవా లంగోరియా, సోఫియా వెర్గారాలతో పాటు స్పానిష్ క్వీన్ లెటిజియాకు రోసా క్లారా డిజైనర్‌గా పనిచేస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications