డోపింగ్ బయటపెట్టిన జర్మనీ జర్నలిస్టుకు ‘రష్యా’ వీసా నిరాకరణ
హైదరాబాద్: గతంలో ఒలింపిక్స్‌లో రష్యా ఆటగాళ్ల డోపింగ్‌ను బయటపెట్టిన జర్మనీ జర్నలిస్టు హాజో సెప్పెల్ట్‌కు రష్యాలో వచ్చే నెలలో రష్యాలో జరిగే సాకర్ కప్ టోర్నమెంట్ కవరేజీకి రష్యా ఫిఫా నిర్వాహక కమిటీ వీసా నిరాకరించింది. ఒక దేశానికి చెందిన క్రీడాకారుల డోపింగ్ బయటపెట్టడం సహజంగా జరిగే పరిణామం. రష్యా తప్పనిసరిగా కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉన్నదని హాజో సెప్పెల్ట్ తెలిపాడు.
హాజో సెప్పెల్ట్ వీసా కోసం జర్మనీ అధికార వార్తా ప్రసారాల సంస్థ 'ఎస్‌డబ్ల్యూఆర్' రష్యా ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. కానీ రష్యా మాత్రం హాజో సెప్పెల్ట్ పేరును అవాంఛనీయ వ్యక్తుల జాబితాలో పెట్టడంతోపాటు వీసా నిరాకరించినట్లు తెలిపింది. వీసా నిరాకరణకు కారణాలు మాత్రం స్పష్టంగా రష్యా చెప్పలేదని వార్తలు వచ్చాయి. 2014లో రష్యాపై విధించిన డోపింగ్‌ను ఎత్తివేశారని ఎస్‌డబ్ల్యూఆర్ నెట్ వర్క్ అనుబంధ టీవీ చానెల్ ఎఆర్డీ వెబ్‌సైట్‌కు హాజో సెప్పెల్ట్ రాశారు.

వీసా నిరాకరణపై రష్యా పునరాలోచిస్తుందని ఎఆర్డీ డైరెక్టర్ వొల్కర్ హెర్రెస్
తమ జర్నలిస్టు హాజో సెప్పెల్ట్‌కు వీసా నిరాకరించిన విషయమై రష్యా రాజకీయ నాయకులు తమ నిర్ణయాన్ని పున: పరిశీలిస్తారని భావిస్తున్నామని ఎఆర్డీ ప్రోగ్రామ్ డైరెక్టర్ వొల్కర్ హెర్రెస్ తెలిపారు.

వీసా నిరాకరణపై ఫిఫా జోక్యం చేసుకోవాలని కోరిన జర్మనీ
తమ జర్నలిస్టు హాజో సెప్పెల్ట్‌కు రష్యా సాకర్ నిర్వాహక కమిటీ వీసా నిరాకరించిన విషయమై ఫిఫా స్పందించాలని జర్మనీ అభిప్రాయ పడింది. తమ జర్నలిస్టు హాజో సెప్పెల్ట్‌కు వీసా నిరాకరణ అన్యాయమని, అవమానకరమని జర్మనీ పార్లమెంట్ సభ్యుల క్రీడా కమిటీ చైర్మన్ డాగ్మార్ ఫ్రైటాగ్ అభిప్రాయ పడ్డారు. దీనిపై ఫిఫా అధ్యక్షుడు జియాన్నీ ఇన్ ఫాంటినో ఎలా ప్రతిస్పందిస్తారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

శుక్రవారం పుతిన్‌తో ఎంజీలా మెర్కెల్ భేటీ
కాగా, వచ్చే శుక్రవారం రష్యాలోని సోచీలో ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జర్మనీ చాన్స్‌లర్ ఎంజీలా మెర్కెల్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఈ చర్చల్లో హాజీ సెప్పెల్ట్‌కు వీసా నిరాకరణ అంశం చర్చకు వస్తుందని భావిస్తున్నారు. జర్మనీ విపక్ష ఎంపీ అన్నాలెనా బైర్బుక్ మాట్లాడుతూ వచ్చేనెల 14వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు జరిగే టోర్నమెంట్‌కు జర్మనీ మంత్రులు హాజరు కావద్దని కోరారు.

మీడియాకు ఫిఫా స్వేచ్ఛ నిస్తుందని భావిస్తున్నట్లు జర్మనీ సాకర్ సమాఖ్య
ఫిఫా మీడియాకు ఇస్తున్న స్వేచ్ఛను కొనసాగిస్తుందని భావిస్తున్నట్లు జర్మనీ సాకర్ సమాఖ్య అధిపతి రైన్‌హార్డ్ గ్రిండెల్ తెలిపారు. అయితే ఫుట్‌బాల్ వరల్డ్ గవర్నింగ్ బాడీ ‘ఫిఫా' మాత్రం ఇప్పటికే సెప్పెల్ట్‌కు అక్రిడిటేషన్ జారీ చేశామని చెప్పారు. తమకు మీడియా స్వేచ్ఛ చాలా ముఖ్యమని ఫిఫా ఒక ప్రకటనలో తెలిపింది. తాజాగా హాజీ సెప్పెల్ట్ విషయమై రష్యా స్థానిక సాకర్ కప్ నిర్వాహక కమిటీ నుంచి సమాచారం తెప్పించుకున్న తర్వాతే స్పందిస్తామని తెలిపింది. తమ నిబంధనలకు లోబడి జర్నలిస్టులంతా తమ విధులు నిర్వర్తించేందుకు చర్యటు తీసుకుంటామని పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications