Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మాఫియాతో లింక్: ఇటలీ ఫుట్‌బాలర్ల భవితవ్యంపై నీలినీడలు

హైదరాబాద్: ఇటలీ ఫుట్‌బాల్ ప్లేయర్లు పెప్ రెయినా, పాలో కన్నావారో, సాల్వాటోర్ ఆరోనికా మాఫియాతో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇటాలియన్ ఫుట్‪బాల్ ఫెడరేషన్ (ఎఫ్ఐజీసీ) ఏర్పాటు చేసిన కమిటీ తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సదరు ఆటగాళ్లపై నాప్లెస్ మాఫియా వ్యతిరేక విభాగం దర్యాప్తునకు ఆదేశించింది. పెప్ రెయినా, పాలో కన్నావారో, సాల్వాలోర్ అరోనికాలను క్రమశిక్షణా సంఘం ముందు విచారణకు హాజరు కావాలని ఎఫ్ఐజీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ గౌసెప్పె పెకొరారో ఆదేశించారు.

కొన్నేళ్లుగా నాపోలీ క్లబ్ తరఫున కన్నావారో, అరోనికా ఆడుతున్నారు. లివర్‌పూల్ మాజీ గోల్‌కీపర్ పెప్ రెయినా ఈ వేసవిలో నాపోలీ క్లబ్ జట్టు నుంచి ఏసీ మిలాన్ క్లబ్‌లోకి మారనున్నారు. నాప్లెస్ కెమోర్రా మాఫియాలో పేరొందిన వ్యక్తులు ఎస్పోసిటో బ్రదర్స్ గాబ్రియెలీ, ఫ్రాన్సెస్కో, గైసెప్పెలతో ఈ ముగ్గురు ప్లేయర్లకు గల సంబంధాలపై ఎఫ్ఐజీసీ క్రమశిక్షణా సంఘం ప్రశ్నించనున్నది.

పెప్ రెయినాకు వీడ్కోలు

పెప్ రెయినాకు వీడ్కోలు

ఇటీవలే నాప్లెస్ నైట్ క్లబ్ ఆధ్వర్యంలో రెయినాకు వీడ్కోలు విందు ఇచ్చారు. అనుచిత లబ్ధి పొందినందుకు నాపోలీ గేమ్స్‌లో ఎస్పోసిటో బ్రదర్స్‌కు రెయినా, కన్నావారో ఉచితంగా టిక్కెట్లు అందజేసే వారని విమర్శలు ఉన్నాయి. నాపోలీ, సాస్సౌలో పాలెర్మో క్లబ్‌ల ప్రతినిధులను కూడా ఎఫ్ఐజీసీ ప్రాసిక్యూటర్లు ప్రశ్నించనున్నారు. ఎఫ్ఐజీసీ క్రమశిక్షణా సంఘం ముందు టిక్కెటింగ్ మాజీ అధిపతి లౌగీ కస్సానో, టీం మేనేజర్ పాలో డి మ్యాట్టిస్‌లతోపాటు ఈ ముగ్గురు ప్లేయర్లు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది.

గత డిసెంబర్ లోనే కన్నావారో రిటైర్మెంట్

గత డిసెంబర్ లోనే కన్నావారో రిటైర్మెంట్

కన్నావారో (36) గతేడాది డిసెంబర్ నెలలో ఫుట్‌బాల్ నుంచి రిటైరయ్యారు. ఆయన స్థానంలో చైనీస్ సూపర్ లీగ్ క్లబ్ గౌవాంజు ఎవర్ గ్రాండే కోచింగ్ స్టాఫ్‌గా 2006 వరల్డ్ కప్ విజేత ఫాబియో కన్నావారో చేరాడు. 2010 వరల్డ్ కప్ చాంపియన్ స్పెయిన్ టీం ప్లేయర్ పెప్ రెయినా తొలిసారి లోన్ ద్వారా 2013 లివర్ పూల్ క్లబ్ జట్టు నుంచి నాపోలీ క్లబ్‌లో చేరాడు. 2008, 2012 యూరోపియన్ చాంపియన్‌గా స్పెయిన్‌ను నిలిపాడు పెప్ రెయినా.

పెప్ రెయినా కెరీర్ ఇలా

పెప్ రెయినా కెరీర్ ఇలా

2015లో నాప్లెస్ జట్టులో చేరడానికి ముందు పెప్ రెయినా బేయర్న్ మునిచ్ జట్టులో ఆడాడు. పెప్ రెయినా తన కెరీర్‌లో ‘యుఇఎఫ్ఎ సూపర్ కప్, ఎఫ్ఎ కప్, లివర్ పూల్ జట్టు తరఫున లీగ్, బేయర్న్ క్లబ్ తరఫున బండేస్లిగా టైటిల్, 2014లో ఇటాలియన్ కప్ టైటిల్ గెలుచుకున్నారు పెప్ రెయినా.

 ఇంటర్ కాంటినెంటల్ కప్ టోర్నీలో చైనీస్ తైపీతో ఇండియా ఢీ

ఇంటర్ కాంటినెంటల్ కప్ టోర్నీలో చైనీస్ తైపీతో ఇండియా ఢీ

వచ్చేనెల ఒకటో తేదీ నుంచి భారత్ ఆతిథ్యం ఇచ్చే అండర్ - 23 టోర్నీలో భారత జట్టు చైనీస్ తైపై టీంతో తలపడనున్నది. ముంబైలోని ఫుట్ బాల్ ఎరీనాలో హీరో ఇంటర్ కాంటినెంటల్ కప్ ప్రారంభం కానున్నది. ఆ మరుసటి రోజు కెన్యా, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. ఈ టోర్నమెంట్ ను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. వచ్చే ఏడాది యుఎఇలో జరిగే ఆసియా ఫుట్ బాల్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్సీ) టోర్నీకి సిద్ధమయ్యేందుకు భారత్ ఇంటర్ కాంటినెంటల్ టోర్నీలో అండర్ 23 భారత్ టీం ఆడుతోంది. ఆటతీరును మెరుగు పరుచుకునేందుకు ఇంటర్ కాంటినెంటల్ కప్ టోర్నమెంట్ చాలా ముఖ్యమైందని భారత్ అండర్ 23 టీం కోచ్ స్టీఫెన్ కాంస్టాంటైన్ తెలిపాడు.

 ఇంటర్ కాంటినెంటల్ కప్ టోర్నీకి ఇండియా సిద్ధం

ఇంటర్ కాంటినెంటల్ కప్ టోర్నీకి ఇండియా సిద్ధం

ప్రస్తుతం జాతీయ టీం ఇంటర్ కాంటినెంటల్ కప్ కోసం సిద్దం అవుతుంది. ఓషియానా నుంచి కెన్యా, న్యూజిలాండ్ క్లబ్ జట్లు, ఎఎఫ్సీ నుంచి చైనీస్ తైపై జట్టు నాలుగు దేశాల ఇంటర్ కాంటినెంటల్ కప్ టోర్నీలో పాల్గొంటున్నాయి. నాలుగు జట్లు ప్రతి జట్టుతో పరస్పరం పోటీ పడుతుంటాయి. జూన్ 10వ తేదీన గ్రాండ్ ఫినాలే జరుగనున్నది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్ స్థానం 97. 2016 జూన్ నుంచి గతేడాది నవంబర్ వరకు 12 అధికారిక మ్యాచ్‌ల్లో భారత్ పాల్గొన్నది.

టైంటేబుల్:

జూన్ 1: భారత్ వర్సెస్ చైనీస్ తైపై

జూన్ 2: కెన్యా వర్సెస్ న్యూజిలాండ్

జూన్ 4: భారత్ వర్సెస్ కెన్యా

జూన్ 5: చైనీస్ తైపై వర్సెస్ న్యూజిలాండ్

జూన్ 7: భారత్ వర్సెస్ న్యూజిలాండ్

జూన్ 8: చైనీస్ తైపై వర్సెస్ కెన్యా

జూన్ 10: గ్రాండ్ ఫినాలే

Story first published: Thursday, May 24, 2018, 11:01 [IST]
Other articles published on May 24, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+